మంటతో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు

We Can Charge Our Mobile Using Fire

03:13 PM ON 6th May, 2016 By Mirchi Vilas

We Can Charge Our Mobile Using Fire

చాలా మంది ఫోన్ చార్జింగ్ సమస్య ఎదుర్కోవడం తెల్సిందే. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు..యాత్రలకు వెళ్లినప్పుడు ప్రధానంగా ఎదురయ్యే సమస్యల్లో ఫోన్‌లో బ్యాటరీ ఖాళీ అయిపోవడం చూస్తూనే వుంటాం. వెళ్లిన చోటల్లా ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టేందుకు వీలుండదు. ఎడారి ప్రాంతాల్లోకి వెళితే ఆ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే..అలాంటి సమయాల్లో మీరు కాసింత మంట రాజేయగలిగితే చాలు ఎంచక్కా ఐఫోన్‌ బ్యాటరీని ఛార్జ్‌ చేసుకొవచ్చు! అందుకోసం ‘ఫ్లేమ్‌స్టోవర్‌’ అనే సరికొత్త ఛార్జర్‌ మార్కెట్‌లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి:ఈ పార్క్ కి న్యూడ్‌గానే వెళ్ళాలట

మంట నుంచి ఛార్జింగ్‌ ఎలా పెడతారన్న ప్రశ్న మీకు రావొచ్చు. ఛార్జర్‌కు ఒక వైపు ఉండే బ్లేడును మంటలో ఉంచాలి. అది ఉష్ణ శక్తిని గ్రహిస్తుంది. ఆ ఉష్ణాన్ని చిన్నటి విద్యుత్‌ జనరేటర్‌లోకి పంపిస్తుంది. ఆ జనరేటర్‌ నుంచి యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకుని ఐఫోన్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చట. ఇలా ఓ నిమిషంసేపు ఛార్జింగ్‌ పెడితే రెండు నిమిషాలపాటు ఫోన్‌ మాట్లాడుకునేంత బ్యాటరీ నిండుతుందని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్లతోపాటు.. చిన్నపాటి గ్యాడ్జెట్లకు కూడా ఈ ఛార్జర్‌ పనిచేస్తుందని తయారీ సంస్థ చెప్పుకోస్తోంది.

ఇవి కూడా చదవండి:అల్లు అర్జున్ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి:24 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

A New charger was introduced that we can charger our gadgets using fire. This gadget converts heat energy into electrical energy with the use of small transformer.