టీచర్‌ అవతారం ఎత్తనున్న ట్విట్టర్‌!

We Can Get Knowledge From Twitter

03:21 PM ON 29th April, 2016 By Mirchi Vilas

We Can Get Knowledge From Twitter

అవునా, అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇది నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియాగా వున్న ట్విట్టర్‌. భవిష్యత్తులో ట్విట్టర్‌ అకౌంటే విద్యార్థులకు టీచర్‌గా మారనుందట. ట్విట్టర్‌ను విద్యార్థులు సరిగ్గా వినియోగించుకుంటే విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు.. పాఠశాల పూర్తయ్యాక అది అధ్యాపకుడిగానూ ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలోని వెర్మోంట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎనిమిదో తరగతి విద్యార్థులపై ఒక అధ్యయనం చేశారు. వీరు ట్విట్టర్‌ను సరిగ్గా వినియోగించుకుంటూ ఆయా పాఠ్యాంశాల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నట్లు గుర్తించారు. తాము ఎంచుకున్న రంగానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అంశాలను ట్విట్టర్‌ ద్వారా తెలుసుకుంటున్నట్లు 95 శాతం మంది విద్యార్థులు వెల్లడించారు. నాసా, ఇతర ప్రముఖ సంస్థలను అనుసరించడం ద్వారా విద్యార్థులు ఆయా అంశాలపై నిరంతరం తాజా సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నారు. పైగా తాము ఎంచుకున్న రంగంలో ప్రముఖులను అనుసరించడంతో పాటు వారితో చర్చించేందుకూ వీలవుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. మొత్తానికి విజ్ఞానార్జనకు ట్విట్టర్‌ బాగా ఉపయోగపడుతున్నట్లు 81 శాతం మంది విద్యార్థులు తెలిపారు. సందేహాలు నివృత్తి చేసే సాధనంగా ట్విట్టర్‌ టీచర్ అవతారం ఎత్తితే చాలామంది విద్యార్ధులకు బోల్డంత ఉపయోగం ..

ఇవి కూడా చదవండి: మాల్యాను అప్పగించ మని కోరిన భారత్

ఇవి కూడా చదవండి: బ్రహ్మోత్సవంలో కాపి కొట్టిన మహేష్

English summary

Recently In A Study Made on Eight Clss Students Found that They were acquiring knowledge from the worlds popular Social Networking Site Twitter.