ఈ షర్టు వేసుకుంటే సంగీతం వినొచ్చు...

We can hear music with this shirt

06:29 PM ON 2nd November, 2016 By Mirchi Vilas

We can hear music with this shirt

మనం ఎంత బాధలో ఉన్నా మంచి పాట.. సంగీతం వింటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాదు రాళ్లను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉందని అంటారు. ఇక మధురమైన సంగీతాన్ని మనం చక్కగా ఆస్వాదిస్తాం. కానీ.. చెవిటివాళ్లకు ఆ అవకాశం లేదు. మాటలు వినడానికి ప్రత్యేక పరికరాలు ఉన్నా.. ఏదైనా సంగీత కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రేక్షకుల సందడిలో సంగీతాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకే అలాంటి వారికోసం ఓ సంస్థ సౌండ్ షర్టును రూపొందించింది. లండన్ కి చెందిన క్యూట్ సర్క్యుట్ అనే ఫ్యాషన్ సంస్థ జర్మనీకి చెందిన ఆర్కెస్ట్రా బృందంతో కలిసి చెవిటివారు సంగీతాన్ని ఫీలయ్యేలా చేసే ఈ సౌండ్ షర్టును తయారు చేసింది.

ఈ షర్టులో 16 మోటార్లను.. వైర్ లెస్ సిస్టమ్ ను అమర్చారు. ఒక్కో మోటార్ ఒక్కో సంగీత వాయిద్యానికి సంబంధించింది. ఇది పని చేయాలంటే, ముందుగా స్టేజ్ పై ఉన్న ఆర్కెస్ట్రా చుట్టుపక్కల మైక్రోఫోన్లను అమర్చాలి. బృందం వాయించే సంగీతం మైక్రోఫోన్లలో రికార్డు అయి సౌండ్ షర్టు సాఫ్ట్ వేర్ ద్వారా అవి షర్టుకి చేరుతాయి. దీంతో వారు వాయిస్తున్న సంగీతాన్ని బట్టి షర్టులో వైబ్రేషన్లు వస్తాయి. ఆ వ్రైబేషన్లతో సౌండ్ షర్టు ధరించినవారు సంగీతాన్ని మనసులో, భౌతికంగా ఫీలవుతారట. నిజంగా ఇది చెవిటివారికి ఉపయోగ పడుతుందని పలువురు అంటున్నారు.

English summary

We can hear music with this shirt