మీ దగ్గర ఈ కెమికల్స్ ఉంటే మీ పాత ఫోన్ నుంచి బంగారం తియ్యొచ్చు!

We can recover gold from old phones

11:41 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

We can recover gold from old phones

ఏంటీ పాత ఫోన్ నుంచి బంగారం తియ్యొచ్చు అంటే జోక్ అనుకుంటున్నారా? జోక్ కాదు నిజమండీ బాబు.. ఏంటి నమ్మ బుద్ధి కావడం లేదా? అయితే మేటర్ లోకి వెళ్లాల్సిందే.. వాడిపారేసిన ఎలక్ట్రానిక్ పరికరాలపై ఓ కెమెకిల్ ను ఉపయోగించి ఏడాదికి ఏకంగా 300 టన్నుల బంగారాన్ని రాబడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే పాత గాడ్జెట్ ల నుంచి బంగారాన్ని వెలికితీసేందుకు అనుసరిస్తోన్న ప్రస్తుత పద్ధతలు చాలా ప్రమాదంతో కూడుకుని ఉన్నాయని బ్రిటన్ కు చెందిన ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. పాత పద్ధతుల్లో భాగంగా ఫోన్ ల నుంచి బంగారాన్ని సేకరించేందుకు సైనైడ్(cyanide) వంటి ప్రమాదకర కెమికల్స్ ను వాడవల్సి ఉంటుందని వీరు చెబుతున్నారు.

1/6 Pages

సైనైడ్ వంటి కెమికల్స్ మనిషి ఆరోగ్యానికి చాలా హానీ కలిగిస్తాయి. వీటిలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పొవటం ఖాయం. పాత ఐఫోన్ ల నుంచి గతేడాది ఆపిల్ కంపెనీ దాదాపు టన్ను బంగారాన్ని సేకరించినట్లు సమాచారం. ఐఫోన్ ల నుంచే కాకుండా మాక్ బుక్స్, ఐపాడ్స్ నుంచి బంగారం రాబట్టుకుంటుందోని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్ట్ తెలిపింది. మరీ ఫోన్ నుంచి బంగారం తీయడం ఎలా సాధ్యం అవుతుందని అనుకోవచ్చు కదా.. తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని చెబుతోంది ఆపిల్ కంపెనీ.

English summary

We can recover gold from old phones