ఉన్నచోటు నుంచే అన్ని ప్రదేశాలు చూసేయొచ్చట!

We can see the entire city in Changi airport Singapore

12:10 PM ON 6th September, 2016 By Mirchi Vilas

We can see the entire city in Changi airport Singapore

విమానంలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదయినప్పటికీ తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకొనే వెసులుబాటు ఉండడమే ఇందుకు కారణం. ఒక్కసారైనా విమానం ఎక్కాలని కోరిక అందిరిలో కలుగుతోంది. ఇక కొన్ని విమానయాన సంస్థలు, టూరిజం సంస్థలు ప్రయాణికుల్ని అమితంగా ఆకట్టుకోవడానికి సరికొత్త ఆలోచనలను ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ప్రయాణికుల సంఖ్యను పెంచడమే కాకుండా ఆ దేశ పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సింగపూర్ లోని చాంగీ విమానాశ్రయం, ఆ దేశ పర్యాటక సంస్థతో ఒప్పందం చేసుకొంది. 2009లో చాంగీ ఎయిర్ పోర్ట్, సింగపూర్ పర్యాటక సంస్థ ఉమ్మడిగా ఒక ఆలోచన చేశాయి.

1/4 Pages

ఇప్పుడా ఆలోచన చాంగీ విమానశ్రయానికి వెళ్లిన ప్రయాణికులందర్నీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తోంది. అదేమిటంటే, చాంగీ ఎయిర్ పోర్టులో ఉంటే చాలు, సింగపూర్ మొత్తాన్ని చూసేయొచ్చు. మీరు ఏమేమీ చూడాలనుకుంటున్నారో.. ఎక్కడ విహరించాలనుకుంటున్నారో అవన్నీ మీ చెంతకే వచ్చేస్తాయి. ఏమిటి ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? నిజం ఇది. అక్కడి ఎయిర్ పోర్టులో ఉండే గోడలకు డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించారు. ఫలితంగా మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో అక్కడి వాతావరణం ఇమేజ్ రూపంలో గోడపై ప్రత్యక్షమవుతుంది. అక్కడే నిల్చుని ఫొటో తీసుకోవచ్చు.

English summary

We can see the entire city in Changi airport Singapore.