కేవలం వన్ మినిట్ లో నిద్రలోకి వెళ్ళే ట్రిక్(వీడియో)

We can sleep in one minute with this trick

11:05 AM ON 15th June, 2016 By Mirchi Vilas

We can sleep in one minute with this trick

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖం ఎరుగదు అంటారు కదా.. మరి మనిషికి నిద్ర అనేది అత్యంత అవసరం. నిద్ర లేకపోతే మనకు అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి. రోజుకు సరిపడా నిద్రపోతేనే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. అయితే నేటి ఆధునిక ప్రపంచంలో నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిళ్లకు, ఆందోళనలకు గురవుతున్న కొందరు రాత్రి పూట నిద్రపోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. నిద్ర సరిగ్గా పట్టకపోవడంతో ఎక్కువ సేపు మెళకువగా ఉండి ఎప్పుడో అర్థరాత్రి పడుకుని తెల్లారి టైం దాటాక నిద్ర లేస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడాల్సి వస్తోంది.

ఇలా నిద్రలేమితో రకరకాల ఇబ్బందులు పడే వారికి ఓ సింపుల్ ట్రిక్ ను ట్రై చేస్తే, ఈ ట్రిక్ ను ఫాలో అయితే పడుకున్నాక కేవలం ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకోవచ్చు. పడుకున్నాక కేవలం ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకోవాలంటే ఎక్సర్ సైజ్ లు చేయడం, ట్యాబ్లెట్లు మింగడం లాంటి పనులు చేయాల్సిన పనిలేదు. సింపుల్ గా శ్వాస తీసుకోవడం పై నియంత్రణ ఉంటే చాలు. ఈ ట్రిక్ ను ఎవరైనా ప్రయత్నించవచ్చు. దీన్నే 4-7-8 బ్రీత్ టెక్నిక్ అని పిలుస్తారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆండ్రూ వెయిల్ ఈ ట్రిక్ ను కనుగొన్నారు. చిత్రంలో చూపిన విధంగా నాలుకను నోటి లోపల పై భాగాన్ని టచ్ చేసేలా ఉంచాలి.

అలా ఉంచాక 4 సెకన్లు కౌంట్ చేస్తూ శ్వాసను లోపలికి ముక్కు ద్వారా పీల్చాలి. అనంతరం 7 సెకన్లు కౌంట్ చేస్తూ శ్వాసను లోపల అలాగే బంధించాలి. తర్వాత 8 సెకన్లు కౌంట్ చేస్తూ శ్వాసను మొత్తాన్ని నోటి ద్వారా బయటకు పెద్దగా విజిల్ సౌండ్ మాదిరిగా వచ్చేలా గాలిని బయటకు వదలాలి. ఇలా రోజుకు 4 సార్లు చేయాలి. దీని వల్ల కొద్ది రోజుల్లోనే మీరు మార్పు గమనిస్తారు. పడుకున్నాక వెంటనే నిద్రపోగలుగుతారు. ఇక ఎందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసేయండి.

English summary

We can sleep in one minute with this trick