కొబ్బరి చెట్లతో భూకంపాలను అడ్డుకోవచ్చట!

We can stop earthquakes with Coconut trees

11:50 AM ON 16th July, 2016 By Mirchi Vilas

We can stop earthquakes with Coconut trees

చెట్టు వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. అందునా కొబ్బరి చెట్టు వలన కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. అందుకే కొడుకును పెంచుకోవడం కంటే ఓ కొబ్బరి చెట్టును పెంచుకోవడం ఉత్తమం అనే సామెత పుట్టుకొచ్చింది. కొబ్బరి చెట్టులోని ప్రతీ భాగాన్ని ఉపయోగించుకుని మానవులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. అంతేకాదు కొబ్బరి కాయ వల్ల మరో ఉపయోగం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 40 అడుగుల ఎత్తు ఉండే కొబ్బరి చెట్టు నుంచి పడినా కొబ్బరి కాయలు పగిలిపోవు. దానికి కారణం దాని నిర్మాణంలో ఉండే ప్రత్యేకతే. లోపల ఉండే సీడ్(విత్తనం)ను కాపాడేందుకు బయట మూడు పొరలు ఉంటాయి.

విత్తనాన్ని కాపాడడంలో ఎండోకార్ప్(రాతి లాంటి పొర), మీసోకార్ప్(పీచు లాంటి పదార్థం), ఎక్సోకార్ప్(బయటకు కనిపించేది)లదే కీలకపాత్రగా చెబుతారు. ఇక ఈ పొరలలో ఉండే ఒక్కో కణం నిచ్చెనలాగా నిర్మితమై ఉంటుందని, అందుకే ఒక పొరలో ఏర్పడిన పగులు మరో పొరని చేరడం కష్టమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఎండోకార్ప్ చుట్టూ ఉండే మీసోకార్ప్(పీచు లాంటి పదార్థం) షాక్ ఎబ్జార్వర్ గా పనిచేస్తోందని తెలుసుకున్నారు. అందువల్ల కొబ్బరికాయ బయటి నుంచి లోపలికి వచ్చే శక్తి క్రమేపీ బలహీనపడుతోందని తెలిపారు. ఈ శైలిలోనే తక్కువ బరువుతో, ఎక్కువ పొరలు కలిగి బాహ్య శక్తిని క్షీణింపచేసే విధంగా ఇళ్లను నిర్మించుకుంటే భూకంపాలు కూడా వాటిని ఏమీ చేయలేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే ప్రతి ఇంటా ఓ మొక్కను పెంచాలి. ముఖ్యంగా కొబ్బరి మొక్కను కూడా నాటాలి.

English summary

We can stop earthquakes with Coconut trees