రూ. 1000కే జనతా బుల్లెట్.. కాంటెస్ట్ తో ఫాన్స్ కి బంపరాఫర్!

We can win Janatha Garage bullet with 1000 rupees

10:41 AM ON 16th August, 2016 By Mirchi Vilas

We can win Janatha Garage bullet with 1000 rupees

ఈ మధ్య కొన్ని సినిమాలకు స్పెషల్ కాంటెస్ట్ లు నిర్వహిస్తూ, అభిమానులకు - ప్రేక్షకులకు ఆఫర్ లు ప్రకటించడం జరుగుతూ వుంది. తాజాగా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుక ఘనంగా జరిగిన నేపథ్యంలో అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బుల్లెట్ బైక్ ను రూ. 1000కే దక్కించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అందుకోసం జనతాగ్యారేజ్ అఫిషియల్ వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేశారు. 'పికర్' అనే సంస్థ జనతా గ్యారేజ్ బుల్లెట్ బైక్ కు సంబంధించిన కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది.

'జనతాగ్యారేజ్.కామ్' అనే వెబ్ సైట్ ను క్రియేట్ చేసి ఇచ్చట అన్ని వస్తువులు దొరుకుతాయి అనే ట్యాగ్ లైన్ పెట్టి ఎన్టీఆర్ అభిమానులను ఆకర్షిస్తోంది. వెబ్ సైట్ లో లాగిన్ అయి వెయ్యి రూపాయలు డొనేట్ చేస్తే బుల్లెట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. వెయ్యి రూపాయలు డొనేట్ చేసే ప్రతి ఒక్కరికీ జనతాగ్యారేజ్ టీ షర్ట్ లేదా షర్ట్ ఇస్తారట. అంతేకాకుండా ఎన్టీఆర్ సంతకంతో కూడిన థ్యాంక్స్ ఫర్ డొనేటింగ్ అనే ఉత్తరం కూడా వస్తుందట. వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ డొనేట్ చేయాలనుకునేవాళ్లు... వారి డొనేషన్ ను బట్టి ఎంట్రీలు కూడా పెంచుకోవచ్చట. ఫైనల్ గా లక్కీ విన్నర్ ను ఎన్టీఆర్ ఎంపిక చేస్తారట. ఇలా బులెట్ ఇవ్వడమే కాకుండా డొనేట్ చేసిన వారిలో 10 మంది లక్కీ విన్నర్స్ ను ఎంపిక చేసి ఎన్టీఆర్ ను కలిసే అవకాశం కల్పిస్తారట.

English summary

We can win Janatha Garage bullet with 1000 rupees