సందీప్‌ సినిమాకి మనమే పేరు పెట్టాలట

We have to select title for Sundeep Kishan movie

06:53 PM ON 9th February, 2016 By Mirchi Vilas

We have to select title for Sundeep Kishan movie

హీరో సందీప్‌ కిషన్‌ తాజాగా నటించబోయే చిత్రానికి మనమే పేరు పెట్టాలట. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన 'నేరం' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటించనున్నాడు. అయితే సందీప్‌ ప్రస్తుతం 'ఒక అమ్మాయి తప్ప' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఘాటింగ్‌ అయిపోయాక సందీప్‌ 'నేరం' రీమేక్‌లో పాల్గొననున్నాడట. అయితే ఈ చిత్రానికి పేరు పెట్టే అవకాశం మనకిచ్చాడు సందీప్‌. అవును ఈ చిత్రానికి మొత్తం ఐదు టైటిల్స్‌ని ఫిక్స్‌ చేసి పెట్టారు. అందులో మనకి నచ్చింది వారు ఇచ్చిన నెంబర్‌కి మెసేజ్‌ చెయ్యాలట. అందులో ఏ టైటిల్‌కి ఎక్కువ మెసేజ్‌లు వస్తాయో దానినే ఫిక్స్‌ చేశ్తారట, బాగుంది కదూ ఐడియా.

ఒకపక్క పబ్లిసిటీ మరోపక్క సినిమాకి టైటిల్‌ కూడా వచ్చేస్తుంది కదా! ఈ చిత్రాన్ని ఏటీవీ సమర్పణలో అనిల్‌ సుంకర్‌ నిర్మించనున్నాడు. మిర్‌. నూకయ్య ఫేమ్‌ అనీల్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

English summary

The audience have to select the title from 5 titles for Sundeep Kishan movie. This movie is remaking from malayalam super hit Neram movie.