పర్మిషన్ ఇవ్వాల్సిందే

We want Permission

11:35 AM ON 25th January, 2017 By Mirchi Vilas

We want Permission

విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఈనెల 26వ తేదీన ఆంధ్రయువత స్పెషల్ స్టేటస్ కోసం చేపట్టబోతోన్న నిరసన ప్రదర్శనకు అనుమతివ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఎపి డీజీపీ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాడు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతీ పౌరుడి హక్కని వ్యాఖ్యానించాడు. ఆర్కే బీచ్ లో ఆంధ్రయువత చేపడుతున్న ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతివ్వాలని డిమాండ్ చేశాడు. ఈ టైంలో అనుమతిలేదంటూ ప్రభుత్వం ప్రకటించడం నిరసనకారుల్లో అశాంతికి కారణమయినట్టేనని వపన్ కళ్యాణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. హామీల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేయడం దేశ పౌరులుగా వారి హక్కు అని ఉద్ఘాటించాడు. నిరసన దీక్షకు అనుమతించకపోతే విద్యార్థుల్లో అశాంతి రగిలే అవకాశం ఉందన్నాడు. శాంతియుత నిరసన యువత హక్కు అని అన్నాడు.

నో అంటూ తేల్చేసిన డిజిపి ...

జనవరి 26వతేదీన ఆర్కే బీచ్ లో నిర్వహించతలపెట్టిన ప్రత్యేకహోదా నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని ఎపి డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ఇలాంటి ప్రదర్శనల్లో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందన్న ఆయన, సోషల్ మీడియాలో వచ్చే ట్వీట్లకు స్పందించవద్దని కోరారు. నిరసన ప్రదర్శనకు ఇప్పటి వరకు ఎవరూ అనుమతి కోరలేదని, ఇప్పుడు అనుమతి కోసం ఎవరైనా వచ్చినా.. ఇంత తక్కువ సమయంలో బందోబస్తు ఏర్పాటు చేయలేమని డీజీపీ తేల్చేశారు.

ఇది కూడా చూడండి : మహాభారత అశ్వత్థామ… ఇప్పటికీ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడా?

ఇది కూడా చూడండి : కాలసర్ప దోషం ఉంటె .. ఏం జరుగుతుందో తెలుసా

English summary

Andhra youth association is planning for a meeting in Vizag near R.K beach, For this the D.G.P refused they don't want to give the permission.Pawan kalyan wants permission from government to organize a peaceful meeting