తప్పుడు ప్రకటనల్లో నటిస్తే నిషేధమే...

We will bann the bad advertisements

12:05 PM ON 7th October, 2016 By Mirchi Vilas

We will bann the bad advertisements

ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై చర్యలతో పాటూ, అందులో నటించే సెలబ్రిటీలపై కూడా కొరడా ఝళిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర - వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చేసిన ప్రకటన ఇలా వుంది. 'ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉండే వ్యాణిజ్య ప్రకటనల్లో నటించే ప్రముఖులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనే సెలబ్రిటీలపై కొన్ని దేశాల్లో జరిమానాలు విధిస్తున్నారు. మరికొన్ని దేశాల్లో మూడేళ్లపాటు నిషేధం విధిస్తున్నారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఇలాంటి ప్రకటనల్లో నటిస్తే జీవితకాలం నిషేధం అమలులో ఉంది.

అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించాం. త్వరలోనే ఈ విషయాన్ని కేబినెట్ ముందు పెడతాం అని ఆయన చెప్పారు.

English summary

We will bann the bad advertisements