పవన్‌ని ఫంక్షన్‌కి తీసుకొస్తే కోటిన్నర ఇస్తాం

We will give 1 and half crore if we bring Pawan Kalyan to the audio function

05:56 PM ON 10th March, 2016 By Mirchi Vilas

We will give 1 and half crore if we bring Pawan Kalyan to the audio function

ఇటీవల కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు ఆడియో ఫంక్షన్లని టీవీ ఛానల్స్‌ బానే క్యాష్‌ చేసుకుంటున్నాయి. స్టార్‌ హీరోలు ఆడియో ఫంక్షన్‌ని కవరేజ్‌ చేసే ఏ ఛానల్‌ని అయినా సరే ఆ టైమ్‌లో ఎంతో మంది ఆ ఛానల్‌ని చూస్తారు. దీనితో ఆ సమయంలో ఆ ఛానల్‌ యొక్క టీఆర్పీ రేటింగ్‌ బాగా పెరుగుతాయి, డబ్బులు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు తాజాగా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఆడియో ఫంక్షన్‌కి కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్‌ కూడా ఇటువంటి ఆలోచనే చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌ టెలీకాస్ట్‌ రైట్స్‌ మాకిస్తే దాదాపు కోటిన్నర రూపాయలు ఇస్తామని చెప్పింది దీనితో పాటు ఒక కండీషన్‌ కూడా విధించింది.

అదేంటంటే ఆడియో ఫంక్షన్‌ కి పవన్‌కళ్యాణ్‌ వస్తేనే కోటిన్నర ఇస్తాం లేదంటే అమౌంట్‌ కట్‌ చేస్తామని కచ్చితంగా చెప్పేశారట. ఎలాగో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఆడియో వేడుక ఓ రేంజ్‌లో జరుగుతుంది. ఇంక పవన్‌ వస్తే ఆ ఛానల్‌ టీఆర్పీ రేటింగ్‌ అమాంతం పెరిగిపోతుంది. అయితే పవన్‌ ఆడియో ఫంక్షన్లు లాంటి వాటికి ఎక్కువ దూరంగా ఉంటారు. కానీ ఈ ఆడియో ఫంక్షన్‌కి పవన్‌ని ఎలా అయినా తీసుకురావాలని ఈ చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ గట్టిగా కృషి చేస్తున్నారట.

English summary

We will give 1 and half crore if we bring Pawan Kalyan to the Sardar Gabbar Singh audio function. This movie is releasing on April 8.