అమల్లోకి వచ్చిన హెల్మెట్ నిబంధన

Wearing Of Helmet Compulsary In AP

05:29 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Wearing Of Helmet Compulsary In AP

మొత్తానికి ఎపిలో ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ నిబంధన అమల్లోకి వచ్చేసింది. వాస్తవానికి నవంబర్ 1వ తేదీ నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ , ఉత్తర్వులు జారీచేసినప్పటికీ , ఆరోజు వాయిదావేశారు. అయితే హెల్మెట్ నిబంధన గురించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో , దీపావళి మర్నాటి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు రాజమండ్రిలో ప్రకటించారు. దీంతో నేటినుంచి హెల్మెట్ వాడకం అమల్లోకి వచ్చింది. నిబంధనలు ఉల్లఘించకుండా ఉండేందుకు , అమలు తీరును పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను రంగంలో దించింది. హెల్మెట్ వాడకపోతే , జరిమానాలు విధిస్తున్నారు. ఎక్కువసార్లు పట్టుబడితే , ఇక ఇబ్బందే మరి ... ద్విచక్ర వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త.

English summary

Wearing Of Helmet Compulsary In AP