స్వైప్ చేయండి.. పుణ్యం పొందండి

Website For Beggars

04:58 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Website For Beggars

స్వైప్ చేసి పుణ్యం పొందడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజమే.. సాధారణంగా మనకు ట్రాఫిక్‌ కూడళ్లలో బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. వాహనాల్లో వెళ్లేవారు సిగ్నల్స్‌ పడినప్పుడు తమకు తోచిన మొత్తాన్ని వారికి వేస్తారు. అయితే అమెరికాలోని డెట్రాయిట్‌ నగరంలోని ఓ సిగ్నల్ వద్ద ఉండే అబె హెగన్‌స్టెన్‌ స్టైలే వేరు. అతను ఏకంగా క్రెడిట్‌ కార్డు ద్వారా కూడా విరాళాలను స్వీకరిస్తామని ప్రకటించడం గమనార్హం. అబెకు ఎలాంటి నివాసం లేదు. హైవే కూడలిలో కూర్చొని వుంటాడు. అతన్ని చూసిన కొందరు దానం చేస్తుంటారు. తనలాంటి వారిని ఆదుకునేందుకు అతను ఓ కొత్త వెబ్‌సైట్‌ను నెలకొల్పాడు. స్థానిక పబ్లిక్‌ లైబ్రరీ నుంచి దీని అప్‌డేషన్‌ను చూస్తుంటాడు. తనకు సహాయం చేసేవారు క్రెడిట్‌కార్డుతో వెబ్‌సైట్‌ ద్వారా చేయవచ్చని సూచిస్తున్నాడు. త్వరలోనే ఒక యాప్‌ను తయారు చేయనున్నట్టు అతను తెలిపారు. నకిలీ భిక్షగాళ్లను కట్టిడి చేసేందుకు ఈ యాప్‌ ఉపయోగకరంగా వుంటుందని అబె వెల్లడించడం విశేషం.

English summary

A Beggar in Detroit has entered the digital age by accepting card donations, setting up a website and making a LinkedIn profile.The former web designer has revolutionised begging by using his mobile phone to process card payments.