వీచాట్‌ నుంచి కాల్ చేయండి

WeChat Calling Feature

05:22 PM ON 8th January, 2016 By Mirchi Vilas

WeChat Calling Feature

ప్రముఖ ఇన్ స్టెంట్ మెసేజింగ్‌ యాప్‌ వీచాట్‌ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. వీ చాట్ ఔట్ అనే ఈ ఫీచర్ ద్వారా దీని యూజర్లు ప్రపంచలో ఎక్కడికైనా.. ఏ మొబైల్స్‌, ల్యాండ్‌లైన్ ఫోన్స్కు అయినా కాల్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ప్రస్తుతం ఉన్న స్కైప్‌, వైబర్‌, వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ ల మాదిరిగానే ఇక నుంచి వీచాట్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. కాలింగ్‌ సదుపాయాన్ని మొదటగా అమెరికా, భారత్‌, హాంగ్‌కాంగ్‌ దేశాల్లో మాత్రమే ప్రవేశపెట్టింది. త్వరలోనే మిగతా అన్ని దేశాల్లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వీ చాట్ ఔట్ ఫీచర్‌లో మొదటగా 0.99 డాలర్లు(సుమారు రూ.66) గిఫ్ట్‌ బ్యాలెన్స్‌ ఇస్తోంది. ఆ తర్వాత దీని కోసం వినియోగదారులు కొంత రుసుము చెల్లించాలి. రూ.60లు చెల్లిస్తే 107 నిమిషాల టాక్‌టైం వస్తుంది. దీంతో నేషనల్ కాల్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతంలో వైఫై వంటి సాధనాల ద్వారా ఇంటర్నెట్‌ను వాడే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుందని వీచాట్ చెబుతోంది. 2011లో ప్రారంభమైన వీచాట్‌కు 600 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.

English summary

Famous social messaging app and will now allow its users to call their friends around the world, on their mobile or landline