ఈ విచిత్ర పెళ్లిళ్లు చూస్తే షాకౌతారు!

Weird marriages of crazy couples

03:10 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Weird marriages of crazy couples

ఇద్దరు మనుషుల్ని, రెండు మనుషుల్ని ముడి వేసే బంధమే 'పెళ్లి'. అందుకే పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు. ఇది మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే అద్భుతమైన వేడుక. అలా జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకునే ఈ వేడుకను ప్రతీ ఒక్కరు తమ స్థోమత కొద్దీ వైభవంగా చేసుకుంటారు. పెళ్లంటే ఆ రెండు కుటుంబాల్లోనూ కొన్ని నెలలు నుండే హడావిడి మొదలవుతుంది. ఇక ఆడవాళ్లు గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నగలు పెట్టుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, ఈ విధంగా ముస్తాబవ్వాలి అని రకరకాలుగా ప్లాన్లు వేసుకుంటారు. పెళ్ళిలో ఎన్ని ఐటమ్స్ వడ్డిస్తే బాగుంటుంది, ఏ ఏ రకాలు వడ్డిస్తే బాగుంటుంది అని పెద్దవాళ్ళు ఆలోచిస్తారు.

ఒకప్పుడు పెళ్లంటే 5 రోజులు పాటు చేసుకునే వారు. కాలం మారే కొద్దీ అది 3 రోజులు, ఒక రోజు, ఇప్పుడు కొన్ని క్షణాలు అనే తీరుకి వచ్చేసింది. ఇప్పుడు పెళ్లంటే బర్త్ డే ఫంక్షన్ కంటే కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకునే ఒక ఫంక్షన్. ఇక బంధువులు అయితే ఒకప్పుడు నెల రోజులు ముందే వచ్చి పెళ్లి పనులు చూసుకునే వారు. కానీ ఇప్పుడు పెళ్ళికి గంట ముందు వచ్చి వెళ్లిపోతున్నారు. అయితే కాలం ఎంత మారినా పెళ్లి అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకటవుతూ చేసుకునే ముచ్చట.

కాలం మారుతున్న కొద్దీ.. ఆచారాలు, పద్ధతులు మారి రకరకాల స్టైల్స్ లో పెళ్లి చేసుకుంటున్నారు. ఏ స్టైల్లో చేసుకున్నా.. అమ్మాయి, అబ్బాయితోనే మూడుముళ్ల బంధం పడుతోంది. కానీ.. కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు మాత్రం చాలా ఫన్నీగా జరిగాయి. ఒకసారి ఆ విచిత్రమైన పెళ్లిళ్లు చూద్దాం..

1/8 Pages

అతి పొడవైన బ్రైడల్ ట్రైన్ లో పెళ్లి:


చైనాలో ఒక మహిళ ప్రపంచ రికార్డు సృష్టించాలనుకుందో ఏమో కానీ, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రైడల్ ట్రెయిన్ సూట్ లో తన పెళ్లి చేసుకుంది. ఈ బ్రైడల్ ట్రైన్ బరువు అక్షరాలా 100 కిలోలు మరియు దీని పొడవు 600 అడుగులు.

English summary

Weird marriages of crazy couples