అమ్మకోసం వింత వింతగా పూజలు(ఫోటోలు)

Weird pooja for Jayalalitha

05:26 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Weird pooja for Jayalalitha

తమిళనాడు సీఎం కుమారి జయలలిత త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడులో భారీ స్థాయిలో పూజలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. రకరకాలుగా పూజలు సాగిస్తున్నారు. క్రేన్ కొక్కానికి వేళ్ళాడుతూ ఓ వృద్ధుడు, త్రిశులాలు గుచ్చుకుని పిల్లలు, ఇక గుళ్ళల్లో, అలాగే బొమ్మల కొలువులో సైతం అమ్మ బొమ్మ పెట్టి ప్రార్ధనలు సాగిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి జయలలితపై చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ, వైద్యానికి ఆమె కావాల్సినంతగా స్పందిస్తున్నారని వెల్లడించారు. జయ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు.

1/4 Pages

అమ్మ ఆరోగ్యంపై పిటిషన్

కాగా ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయాలంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం పూర్తి నివేదిక అందజేయాలని, ఆమె ఆస్పత్రిలో కేబినెట్ సహచరులు, అధికారులతో సమావేశమైనట్లు చెప్తున్నారని.. ఆ ఫోటోలను విడుదల చేయాలని రామస్వామి పిటిషన్ లో కోరారు. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని తమిళనాడు ప్రజలంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సి. విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ ఆస్పత్రికి వెళ్లి జయలలితను పరామర్శించినట్లు చెప్తున్నారు.. కానీ వారు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించలేదని రామస్వామి పిటిషన్ లో తెలిపారు. అలాగే జయలలిత చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారని, ఆ మార్గంలో బారికేడ్లు ఏర్పాటుచేశారని, ఇతరులను ఆ ఆస్పత్రికి చికిత్స కోసం కూడా వెళ్లనీయడం లేదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

English summary

Weird pooja for Jayalalitha