బంగారు వస్తువుల వెనుక వింతలు వున్నాయి తెలుసా?

Weirds behind gold

03:07 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Weirds behind gold

ఈ ప్రపంచంలో అందరి దృష్టి పడేది ముందు భూమి మీద. ఆతర్వాత 'బంగారం' మీద. అందుకే వీలైతే మంచి స్థలం కొనేద్దామని అనుకుంటారు. ఇక రెండవది బంగారం! ఈ పేరు చెబితే చాలు, కళ్ళల్లో మెరుపు రావడం తధ్యం. ముఖ్యంగా ఆడవాళ్ళయితే ఈ పేరు వినగానే తప్పకుండా వారి కళ్ళల్లో మెరుపు రావడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఈ లోహాన్ని ఆభరణాల తయారీలో వాడతారు. బంగారం అంటే హోదా, అంతస్తు, విలాసానికి ప్రతీక. మెడలో బంగారంతో చేసిన ఒక ఆభరణాన్ని ధరిస్తే ఎంత బాగుంటారో కదా. సన్నని లాకెట్టు, దీనికి జతగా చెవి పోగులు మీ అందాన్ని ఇనుమడింపచేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ రకరకాల డిజైన్లలో ఆభరణాలు రూపొందిస్తూ మగువల మనసు దోచుకుంటున్నారు. చాలా మందికి బంగారం అంటే తమ ఆర్ధిక పరిస్థితి బాగోలేనప్పుడు ఆదుకునే ఆపన్న హస్తంగా భావిస్తారు. ఇవీ బంగారానికి సంబంధించిన కొన్ని సాధారణ విషయాలు. ఇవే కాకుండా బంగారానికి సంబంధించి 8 వింతలున్నాయని అంటారు. 'గోల్డ్' అనే పదం పురాతన ఆంగ్ల పదమైన 'గిఓలూ' అనే పదం నుండి పుట్టింది. ఈ మాటకి అర్ధం పసుపు రంగు అని. బంగారానికి సంబంధించిన నిజాలలో ఇది కూడా ఒకటి అని తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది కదూ? ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న కరెన్సీ విలువ మీకు తెలుసు.

కానీ ప్రపంచంలోని ప్రజలందరూ మనకి లభ్యమయ్యే బంగారంలో కేవలం 20 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలుసా మిగతా 80 శాతం భూమి పొరల్లో కప్పబడి వెలికితీయడానికి అసాధ్యంగా ఉంది. ఇవే కాకుండా బంగారానికి సంబంధించిన ఇంకా అనేక విషయాలు మీకు తెలీనివి ఉన్నాయి. బంగారానికి సంబంధించి కింద ఇచ్చిన 8 నిజాలు మీరు తప్పక తెలుసుకోవాల్సినవి. అబ్బురపరిచే ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

1/7 Pages

1. బంగారం కరుగుతుంది:


చాలా మంది బంగారు ఆభరణాలని శుభసూచకంగా భావించి ఎల్లప్పుడూ ధరిస్తుంటారు. కానీ మీరు నిత్యం ఆభరణాలు ధరిస్తుంటే సంవత్సరానికి 6 మిల్లీ గ్రాములు కరిగిపోతుందంట.

English summary

Weirds behind gold