విండీస్ క్రికెటర్లకు కుదిరిన డీల్

West Indies Team For T20 World Cup

10:42 AM ON 16th February, 2016 By Mirchi Vilas

West Indies Team For T20 World Cup

వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు, ఆటగాళ్ల మధ్య ఎట్టకేలకు డీల్ కుదిరింది. మ్యాచ్‌ ఫీజును తగ్గించడంతో క్రికెటర్లు, బోర్డుకు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఫీజు విషయం తేల్చే వరకూ త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించారు. వారంరోజులుగా చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. దీనిపై ఆగ్రహించిన విండీస్‌ బోర్డు ఆదివారంలోపు ఆటగాళ్లు బోర్డు కాంట్రాక్ట్‌ను సమ్మతించాలని లేనిపక్షంలో ద్వితీయశ్రేణి జట్టును టీ20 ప్రపంచకప్‌నకు పుంపుతామని హెచ్చరించింది. దీనిపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఆదివారం 12 మంది ఆటగాళ్లు బోర్డు నిర్ణయానికి సమ్మతి తెలుపుతూ లేఖ రాశారు. అయితే గాయంతో పోలార్డ్‌, నిషేధంలో ఉన్న స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ ఈ జాబితాలో లేరు. దీంతో ద్వితీయ శ్రేణి జట్టు నుంచి కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, అష్లే నర్స్‌లను జట్టులోకి తీసుకున్నారు.

టీ20 వరల్డ్ కప్ విండీస్‌ టీమ్ ఇదే..

డారెన్‌ సామీ(కెప్టెన్‌), క్రిస్‌గేల్‌, సులేమాన్‌ బెన్‌, జాసన్‌ హోల్డర్‌, ఆండ్రీ ఫ్లెచర్‌, డ్వేన్‌ బ్రావో, శామ్యూల్‌ బద్రీ, లెండీ సిమన్స్‌, జెరోమ్‌ టేలర్‌, ఆండ్రీ రస్సెల్‌, మార్లోన్‌ శ్యామ్యూల్స్‌, దినేశ్‌ రామ్‌దిన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, అష్లే నర్స్‌.

English summary

Finally West Indies cricket board had revealed its squd for upcoming T20 world cup.The squad for T20 world cup was Darren Sammy (Captain), Dwayne Bravo, Samuel Badree, Lendl Simmons, Jerome Taylor, Andre Russell, Marlon Samuels, Denesh Ramdin (wicketkeeper), Chris Gayle, Ashley Nurse, Carlos Brathwaite, Sulieman Benn, Jason Holder, Andre Fletcher.