అండర్ 19-విశ్వవిజేత విండీస్‌

West Indies Won Under 19 world Cup

10:40 AM ON 15th February, 2016 By Mirchi Vilas

West Indies Won Under 19 world Cup

అండర్‌-19 ప్రపంచకప్‌ను కరీబియన్ కుర్రాళ్లు కొట్టుకెళ్లిపోయారు. వరుస విజయాలతో ఫైనల్ కు చేరిన యువ భారత్‌ తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ జట్టు విండీస్‌ బౌలర్ల ధాటికి 145 పరుగులకే కుప్పకూలింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (51)ఒక్కడే అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ జట్టు 49.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించి అండర్‌-19 ప్రపంచకప్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రిషబ్‌ పంత్‌(1)తొలి ఓవర్‌లోనే స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత విండీస్ పేసర్ల జోరుతో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (3), కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (4), వాషింగ్టన్‌ సుందర్‌ (7) వరుసగా పెవిలియన్‌ చేరారు. సర్ఫరాజ్‌ (51) ఒంటరిపోరాటం చేశారు. చివర్లో మహిపాల్‌ (19), రాహుల్‌ (21) ఫర్వాలేదనిపించడంతో భారత్‌ 145 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత్‌ బౌలర్లు చివరి ఓవర్‌ వరకూ పోరాడారు. ఒక దశలో 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు కార్టీ (52 నాటౌట్), పాల్‌ (40 నాటౌట్‌)గెలుపుతీరాలకు చేర్చారు.

English summary

West Indies team won Under 19 world cup for the first time in Cricket history.West Indies team won against Indian team in the final match which was held in Bangladesh.