దత్తపుత్రిక ప్రేమ వ్యవహారంలో కేసీఆర్ ఏం చేస్తారో?

What decision will take by telangana cm Kcr on Pratyusha love marriage

12:09 PM ON 4th May, 2016 By Mirchi Vilas

What decision will take by telangana cm Kcr on Pratyusha love marriage

ఆపదలో ఉన్న ఆడపిల్లను ఆదుకుని, అక్కున చేర్చుకుని, దత్త పుత్రికగా కూడా ప్రకటించిన తెలంగాణా సిఎమ్ కేసీఆర్ కి ఓ చిక్కొచ్చి పడింది. ఆ దత్త పుత్రిక ప్రేమలో పడింది. మరి కేసీఆర్ ఒప్పుకుంటారా? లేక భగ్గు మంటారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. ఓసారి వివరాల్లోకి వెళ్తే.. సవతి తల్లి, తండ్రి చేతిలో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లిన ప్రత్యూషను తెలంగాణ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ ఆదుకోవడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంది. ఇటీవలే ఇంటర్ ఒకేషనల్ పరీక్ష సైతం పాసైంది. అయితే ఇప్పుడు ఆమె పెళ్లిపీటలు ఎక్కబోతోందా? అంటే.. ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన మిత్రుడిని చూడటానికి అదే ఆసుపత్రికి వచ్చిన మద్దిలేటి రెడ్డి అనే కుర్రాడి ప్రేమలో పడింది ప్రత్యూష.

మద్దిలేటి రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారి కాలనీ వాసి. ఆసుపత్రిలో రెండు మూడుసార్లు ప్రత్యూషను కలిసిన మద్దిలేటి రెడ్డి ఆమె ఆరోగ్య పరిస్థితిని పరామర్శించాడు. తన ఊరికి వెళ్లేందుకు ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు. అప్పుడప్పుడు ఫోన్లలో మాట్లాడుకున్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అతడిని పెళ్లి చేసుకుంటానని ప్రత్యూష అధికారులకు చెప్పినట్లు సమాచారం. పెళ్లయ్యాకే చదువుకుంటానని న్యాయవాది ద్వారా కోర్టుకు సైతం విన్నవించింది. అయితే ప్రత్యూషను తన దత్తపుత్రికగా ప్రకటించిన కేసీఆర్ దృష్టికి అధికారులు ఆమె ప్రేమ వ్యవహారం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రత్యూష పెళ్లి విషయంలో కేసీఆర్ ఏం నిర్ణయం వెల్లడిస్తారో వేచి చూడాలి.

English summary

What decision will take by telangana cm Kcr on Pratyusha love marriage. Telangana cm Kcr daughter Pratyusha love marriage decision.