శృతి రాత్రిళ్ళు చేసే పని ఇదా?

What Did Sruthi Hassan Will Do At Night

03:20 PM ON 28th January, 2016 By Mirchi Vilas

What Did Sruthi Hassan Will Do At Night

ఈమెకు ప్రతి రోజూ నిద్ర వుండదట. అందరికీ జన్మకో శివరాత్రి అయితే, ఈ ముద్దుగుమ్మకు ప్రతిరోజూ శివరాత్రేనా అన్పిస్తుంది. ఎందుకంటే, అస్సలు నిద్రకూ ఈమెకు పడదట. ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా పడుకున్న దాఖలాలు లేవట. మీడియా వాళ్ళు అడిగితే శ్రుతి హాసన్‌ చెప్పే మజా మాటలు ఇవి. వివారల్లోకి వెళితే,

ఇంతకీ రాత్రిళ్లు పడుకోకుండా పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుందా అంటే అదీ కాదట. నిజానికి పార్టీలకు వెళ్లి, తెల్లార్లూ... అక్కడే గడపడం కూడా ఎలర్జీ యేనట. అసలు ఏం చేస్తుంది ఇంతకూ అంటే, సెట్‌ నుంచి నేరుగా ఇంటికే వెళ్లిపోయాక, మర్నాడు షూటింగ్‌ ఉందంటే, ఇక నిద్ర దరిదాపు చేరదట. రేపటి షూటింగ్ లో సన్నివేశం ఏమిటి? ఆ సన్నివేశంలో ఎవరితో ఎలా నటించాలి? ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? ఎలా ఇంప్రెస్ చేయాలి? వంటి విషయాల గురించి ఒకటే ఆలోచన చేస్తూ వుంటుంది. డైలాగ్‌ పేపర్‌ దగ్గర పెట్టుకుని, ఒకటికి పది సార్లు చదువుతూ కూర్చుంటాని శృతి చెప్పే మాట.

షూటింగ్ వున్నా లేకపోయినా నిత్యం ఇదే తంతు. షూటింగ్ వుంటే డైలాగ్ ప్రాక్టీస్. లేకుంటే, సంగీత సాధనలో రాత్రంతా గడిపేయడం ... ఇదీ వరస.... అయితే ఆలాంటప్పుడే కొత్త కొత్త ట్యూన్లు ఆవిష్కరించ బడతాయని శృతి నమ్మకంగా చెప్పే విషయం. పైగా 'నాకే కాదు.. ఏ సంగీత దర్శకుడికైనా అంతేనేమో' అంటోంది శృతి. 'ఒంటరిగా పని చేసుకోవాలని అనుకొనేవాళ్లకు రాత్రే సరైన సమయం. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది' అని చెబుతోంది. అయితే రోజూ మూడు నాలుగు గంటలు ప్రశాంతంగా మాత్రం పడుకోవడం అలవాటని అంటోంది. మొత్తానికి ఇది కూడా ఆమె ఆరోగ్య సూత్రంగా మారిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారట

English summary

One Of The South Indian Top Actress Sruthi Hassan Says That secret what she do at night times.She said that she will think about tomorrows shooting and the way she want to perform and practice the dialogues of her AND SING SONGS ETC