నిమ్మరసం తాగడం వలన ఉపయోగాలు

What happened when lemon water drink in the morning

07:20 PM ON 30th December, 2015 By Mirchi Vilas

What happened when lemon water drink in the morning

పసుపు రంగులో ఉండే నిమ్మకాయలో గుజ్జు,రసం,తొక్క వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. నిమ్మకాయను ఆహారంలో పుల్లని రుచి కోసం వాడతారు. నిమ్మకాయలో 5 నుంచి 6 శాతం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మరసంలో ఉన్న ప్రత్యేకమైన రుచి కారణంగా కాక్టెయిల్, శీతల పానీయాలలో ఒక ముఖ్యమైన పదార్దంగా వాడతారు. నిమ్మరసం కొన్ని ఆహార పదార్దాలకు సంరక్షణకారినిగా కూడా పనిచేస్తుంది. అది ఎలాగంటే...ఆపిల్, అరటి మరియు అవకాడొ వంటి పండ్లు కోసిన కొంత సేపటికి ఆక్సిడైజ్ జరిగి గోధుమ వర్ణంలోకి మారతాయి. అవి అలా గోధుమ రంగులోకి మారకుండా ఉండాలంటే ఆ ముక్కలకు నిమ్మరసం రాయాలి. నిమ్మకాయ రసం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే నిమ్మకాయ రసం త్రాగితే పొట్ట తగ్గటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఉదయం తప్పనిసరిగా నిమ్మకాయ రసం ఎందుకు త్రాగాలో తెలుసుకుందాం.

1/8 Pages

సాదారణంగా మనం ఉదయం లేవగానే మంచి రుచి మరియు వాసన కలిగిన కాఫీ త్రాగటం జరుగుతూ ఉంటుంది. అయితే కాఫీ త్రాగటాన్ని ఒక అర గంట వాయిదా వేసి కేవలం నిమ్మరసం త్రాగితే చాలా మంచిది.

ఉదయం త్రాగటానికి నిమ్మకాయ నీరు ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక గ్లాస్ చల్లని లేదా వేడి నీటిని తీసుకోవాలి. జీర్ణక్రియ సమస్యలతో బాధ పడుతున్నవారు  వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి.
2. ఇప్పుడు ఈ గ్లాస్ నీటిలో అర చెక్క నిమ్మరసం పిండాలి.
3. దీనిలో ఎటువంటి పంచదార కలపకుండా త్రాగాలి.

ముఖ్య గమనిక

సీసాల్లో అమ్మే నిమ్మ నీటిని ఉపయోగించటానికి వీలు లేదు. ఎందుకంటే వీటిల్లో సల్ఫేట్స్ అధికంగా ఉండుట వలన అలెర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

English summary

Here are the some best uses of lemon water if take in the morning daily. It helps for weight loss and many other.