మనిషి మరణించాక ఆత్మ ఎలా వెళ్తుందంటే .?

What Happens After Death According To Garuda Purana

03:16 PM ON 31st May, 2016 By Mirchi Vilas

What Happens After Death According To Garuda Purana

మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? అతని శరీరాన్నయితే ఖననం చేస్తారు. మరి ఆత్మ సంగతి? అది ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది? మీకు తెలుసా? ఆ… అయినా ఈ రోజుల్లో ఆత్మలు, ప్రేతాత్మలు ఏంటి అంటారా? అలా అనుకునే వారు ఉంటే ఉంటారనుకోండి. వారి సంగతి పక్కన పెడితే అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి? మనిషి మరణించాక అతని ఆత్మకు ఏమవుతుంది? యమధర్మ రాజు దగ్గరికి ఎలా వెళ్తారు? వంటి విషయాలపై ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.

మనిషి మరణానంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో చెప్పారు. మరికొద్ది సెకన్లలో చనిపోతాడనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట. తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది కూడా వస్తుందట. దీంతో అతను ప్రపంచాన్నంతటినీ అర్థం చూసుకున్నా, ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడట. అయితే ఆ సమయంలోనే మనిషి యమదూతలను చూస్తాడట. వారు అత్యంత వికారంగా, నల్లగా, తల అనేది ఒక సరైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా వారు కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా మల విసర్జన చేస్తాడట. అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందట. దీంతో ఆ ప్రాణాన్ని (ఆత్మను) యమదూతలు నరకానికి తీసుకువెళ్తారట.

అయితే ఇది ఒక్కరోజులో జరగదట. ఆత్మలను యమదూతలు నరకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల సమయం పడుతుందట. ఈలోగా దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలు పెడతారట. తమను చూసి భయపడినా, ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరడాల వంటి ఆయుధాలతో చితక్కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట. అంతేకాదు, నరకంలో విధించే శిక్షలను గురించి ఆత్మలకు యమదూతలు కథలు కథలుగా చెబుతారట. దీంతో ఆత్మలు ఏడుస్తాయట. తమను అక్కడికి తీసుకువెళ్లవద్దని ప్రార్థిస్తాయట. అయినా యమదూతలు కనికరించరు సరి కదా, ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మ రాజు ముందు ప్రవేశపెడతారట.

మనుషుల ఆత్మలకు వారు చేసిన పాప, పుణ్యాల ప్రకారం నరకంలో యమధర్మరాజు శిక్షలు వేస్తాడట. చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాప పడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మ రాజు చూడడట. ఇక దొంగతనం, హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట. అబద్దాన్ని కూడా పాపం గానే పరిగణిస్తారట. అయితే పాప, పుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోసారి భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తాడట. ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కర్మకాండలు, పిండ ప్రదానాలు అన్నీ చేయాల్సి ఉంటుందట. ఇవన్నీ మనిషి చనిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాలట. లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్ల పై తిరుగుతుందట. ఈ కథంతా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, గరుడ పురాణంలో ఈ విషయాలన్నీ వున్నాయట. మొత్తానికి ఇంటరెస్టింగా వుంది కదూ...

English summary

We all want to what happens when we were died. Accroding to Garuda Purana when we die then our soul were taken by the Monsters and we will be taken to Lord Yama Dhaarma Raja.