కలలో సముద్రం కనిపిస్తే..

what happens when ocean appears in dreams

11:42 AM ON 5th April, 2016 By Mirchi Vilas

what happens when ocean appears in dreams

కలలు అందరికీ వస్తూ ఉంటాయి. కాని కొంతమంది ఎప్పుడూ నాకు ఇలాంటి కలలే వస్తాయి. అదేంటో అంటుంటారు. నిజానికి మన మనస్సు బాగోలేనప్పుడు ఆందోళన కల్గించే కలలు వస్తుంటాయి. మనస్సు ప్రశాతంతంగా ఉన్నప్పుడు మంచి ఆహ్లాదకరమైన కలలు వస్తుంటాయి. అంటే మన మనస్సును అనుసరించే కలలు పుడతాయనమాట. ఇలాంటి కలలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట. మనస్సు సాధారణస్థితిలో ఉన్నప్పుడు, అది కూడా తెల్లవారు జామున వచ్చే కలలు మాత్రం నిజమవుతాయని కొంతమంది అంటుంటారు.

ఇది కూడా చదవండి : ఇండియాలో భారతీయులకు ఎంట్రీ లేని ప్రదేశాలు

చాలామందికి సముద్రం అంటే చాలా భయం. వారికి సముద్రాన్ని భయటచూస్తేనే మనసంతా అలజడిగా అనిపిస్తుంది. సముద్రం హోరు, కెరటాలు దూకుడు భయాన్ని కల్గిస్తుంది. అలాంటి వారికి సముద్రం కలలో కన్పించినా ఆందోళన గానే ఉంటుంది.

ఇది కూడా చదవండి : పూరిజగన్నాథుని ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

ఆందోళన కల్గించే కలల వల్ల నిద్ర సరిగా పట్టదు. అందువల్ల కల బాగా గుర్తుంటుంది. కొంతమంది పట్టించుకోరు కానీ కొంతమంది ఆందోళనకు గురవుతారు. నిజానికి కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని, అది ఒక సూచనగా భావించాలని చెప్పబడుతోంది. అయితే జీవితమే ఒక సముద్రం లాంటిది. కష్టాలే సుడిగుండాలు, కోరికలే కెరటాలు, తీరమే గమ్యంగా చెప్పబడింది. కాబట్టి వచ్చిన కలల గురించి ఆందోళన చెందకుండా ఇలాంటి కలలు వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. కలల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి.

ఇది కూడా చదవండి : మీది ప్రేమా ? స్నేహమా ? టెస్ట్ చేసుకోండి

English summary

In the dream world, ocean dreams are connected with strong emotions and you’re unconscious.