'ఓంకార్ కి-అంజలి కి' సంబంధమేంటి?

What is relation between Omkar and Anjali

06:56 PM ON 28th December, 2015 By Mirchi Vilas

What is relation between Omkar and Anjali

బుల్లితెర డ్యాన్స్ షో 'ఆట' తో టీవీ ప్రేక్షకులకి దగ్గరయిన యాంకర్ ఓంకార్. ఇందులో తన యాంకరింగ్‌, కాన్సెప్ట్ తో ప్రేక్షకులని టెన్షన్‌ పెట్టి ఆ షోకి టాప్‌ టిఆర్పి రేటింగ్‌ తెచ్చిపెట్టాడు. ఆ తరువాత ఓంకార్‌ మెగా ఫోన్‌ పట్టుకుని 'జీనియస్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఫర్వాలేదనిపించినా కలెక్షన్ల పరంగా ఫ్లాఫ్‌గా నిలిచింది. అయితే కొంత గ్యాప్‌ తీసుకుని 2015 ద్వితియార్ధంలో కామెడీ థ్రిలర్ గా 'రాజు గారి గది' చిత్రం తెరకెక్కించి సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంశలను కూడా అందుకున్నాడు.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో విపరీతమైన కలెక్షన్లు తెచ్చిపెట్టి నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఇప్పుడు 'రాజుగారిగది' చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించే ప్రయత్నంలో ఓంకార్‌ నిమగ్నమయ్యారు. అయితే సీక్వెల్‌ లో మాత్రం స్టార్‌ హీరోయిన్‌ అంజలిని లీడ్‌ రోల్‌లో నటింపజేయాలని ఓంకార్‌ భావిస్తున్నాడట. ఓంకార్‌కి అంజలికి మంచి స్నేహం ఉండడంతో ఓంకార్‌ అంజలిని నటింపజేయాలని ఆలోచిస్తున్నారు.

English summary

Omkar want to do sequel for Raju Gari Gadhi movie. In this film Anjali will play the lead role.