పురుషులు మూత్ర విసర్జన ఎలా చేస్తే మంచిది? నుంచునా లేక కూర్చునా?

What is the benefits of going to urine by standing and sitting

12:01 PM ON 19th August, 2016 By Mirchi Vilas

What is the benefits of going to urine by standing and sitting

మానవ శరీర నిర్మాణం ఓ అద్భుతం... ఒక్కో అవయవం ఒక్కో పని చేస్తుంది. అన్ని అవయవాలు ముఖ్యమే. ఏది లేకున్నా అది పెద్ద లోపమే. ఇక కొన్ని విసర్జన క్రియలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మూత్రం ఒకటి. మన శరీరంలోని రక్తంలో ఉండే పలు వ్యర్థ పదార్థాల మిశ్రమం. దాన్నంతటినీ మూత్రం రూపంలో కిడ్నీలు వడబోస్తాయి. అలా విడుదలైన మూత్రం మూత్రాశయంలోకి చేరుతుంది. అక్కడ మూత్రం నిండుతుందనగానే మెదడు మూత్రానికి వెళ్లాలని సిగ్నల్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో మనం మూత్రానికి వెళ్తాం. అయితే మూత్ర విసర్జన విషయానికి వస్తే పురుషులు, స్త్రీలు భిన్న రకాలుగా చేస్తారు.

స్త్రీలు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే, పురుషులు సాధారణంగా నిలబడి చేస్తారు. పురుషులు నిలబడి కాక, కూర్చుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఎంతో ఉపయోగం ఉంటుందట. అదేంటో పరిశీలిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది కూర్చునే మూత్ర విసర్జన చేస్తారట. ఈ క్రమంలో అలా మూత్ర విసర్జన చేసే వారిలో చాలా మంది ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారట. అనేక మందికి మూత్రాశయ సంబంధ సమస్యలు లేవట. అంతెందుకు, ఒకప్పుడు మన తాతలు, ముత్తాతలు చాలా వరకు కూర్చునే మూత్ర విసర్జన చేసే వారని చెప్పాలి.

పైగా ఆరుబయట చేసేవారు. అయితే ఇప్పుడు అధిక శాతం మంది నిలబడే మూత్ర విసర్జన చేస్తున్నారు. అయితే ఇలా కంటే కూర్చునే మూత్ర విసర్జన చేస్తే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. మూత్ర విసర్జన నిలబడి చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..

1/5 Pages

1. సాధారణంగా మూత్రంలో ఉండేవన్నీ వ్యర్థ పదార్థాలే. ఈ క్రమంలో వ్యాధిగ్రస్తుల నుంచి వచ్చే మూత్రంలో ఒక్కోసారి బాక్టీరియా కూడా ఉంటుంది. దీంతో వారు నిలుచుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఆ బాక్టీరియా అంతా బాగా వెదజల్లినట్టు అవుతుంది. అలా వెదజల్లినట్టు పడే బాక్టీరియా ఇతరుల శరీరాల్లోకి సులభంగా ప్రవేశిస్తుందట. అందుకే కూర్చుని మూత్ర విసర్జన చేస్తే బాక్టీరియా విస్తరించదు. పైగా ఇది ఆరోగ్య రీత్యా మంచిది.

English summary

What is the benefits of going to urine by standing and sitting