మీరు చనిపోయినట్టు కల వస్తే దాని వెనక అర్ధం ఏంటో తెలుసా?

What is the meaning behind that you was died in dream

05:18 PM ON 24th September, 2016 By Mirchi Vilas

What is the meaning behind that you was died in dream

కలలు రావడం సహజం. చూసిన ఘటనలు, మన మెదడులో తరచూ ఆలోచించే విషయాలు, ఊహలు, ఇలా ఎన్నో అంశాలు కలల్లో తారసపడతాయి. ఇక ఇందులో కొన్ని రకాల కలలు ఆనందాన్ని ఇచ్చేటివిగా ఉంటాయి. కొన్ని కలలు మనసుకు నిరాశ కలిగిస్తుంటాయి. ఇవ్వన్నీకూడా మనిషి ఆత్మతో సంబంధం ఉంటుంది. మనిషి నిద్రలోనున్నప్పుడు అతని శరీరం ఆత్మనుంచి వేరుపడుతుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నిద్రపోదు. మనిషి నిద్రావస్థలోనున్నప్పుడు అతని పంచ జ్ఞానేంద్రియాలు కూడా తమ పనికి విశ్రాంతినిస్తాయి. ఇలాంటి సందర్భంలో మనిషి మస్తిష్కం పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది.

ఈ స్థితిలోనున్నప్పుడు మనిషికి ఓ రకమైన అనుభవం ఎదురవుతుంటుంది. అది వారి జీవితంతో కూడుకున్నదై ఉంటుంది. ఆ అనుభవాన్నే కల అని అంటారు. ఈ కలల ఆధారంగానే మనిషియొక్క భూత, భవిష్యత్, వర్తమానాల గురించి తెలుసుకోవచ్చంటున్నారు. ఇక తరచూ మీరు చనిపోయినట్టు కలలు వస్తున్నాయా? ఇటువంటి కల వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారా? అందుకు భయపడాల్సి అవసరం లేదు. మీ జీవితంలో ఏదో నెగటివ్ గా జరగబోతుందని ఊహించుకుని మరింత ఆందోళన చెందుతుంటారు. ఇక తరచూ ఇలాంటి కలలు వెంటాడుతుంటే, దానర్ధం ఏమిటో తెలుసుకుని తీరాల్సిందే.

1/6 Pages

1. మీరు చనిపోయినట్టు కల వస్తే, మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తున్నాయని అర్ధం. ఇది వ్యక్తి జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం. మీ జీవితంలో ప్రయోగాత్మకంగా, అభద్రతగా చేయబోయే పనులు కాస్త భయానికి దారితీస్తుందని అర్థం. అందుకు కలత చెందాల్సిన అవసరం లేదు. మీరు చేసే పనుల వల్ల మంచే జరగుతుంది, అయితే ప్రతి విషయంలో ఆత్రుత పనికిరాదు.

English summary

What is the meaning behind that you was died in dream