మీ ఫోన్ కి LM-xxxx, AD-xxxx అని వచ్చే మెసేజ్ లకు అర్ధం తెలుసా?

What is the meaning of LM-xxxx and AD-xxxx messages

03:06 PM ON 10th September, 2016 By Mirchi Vilas

What is the meaning of LM-xxxx and AD-xxxx messages

గతంలో అయితే ల్యాండ్ లైన్లు ఉండేవి. ఇప్పుడు సాంకేతిక సమాచార విప్లవం కారణంగా మొబైల్ ఫోన్లు అందరి చేతికి వచ్చేశాయి. దీంతో ముఖ్యమైన వాళ్ళతో మినహా, మిగిలిన వారితో ఫోన్ చేసి మాట్లాడ్డం కూడా తగ్గిపోయింది. మెసేజ్ ఇచ్చి సరిపెట్టేస్తున్నారు. ఇక మీ ఫోన్ కి చాలాసార్లు LM-xxxx, AD-xxxx అనే మెసేజ్ లు వస్తుంటాయి. వాటిని గమనించే ఉంటారు. కానీ మనకెందుకులే అని లైట్ గా తీసుకొని ఉంటారు. నిజానికి కూడా వీటి గురించి అంతగా తెల్సుకోవాల్సిన అవసరం లేకపోయినా, అసలు LM, AD అంటే ఏంటి? అని తెల్సుకోవాలని క్యూరియాసిటీ కొందరికైనా ఉంటుంది. LM అనే దానినే తీసుకుంటే.. ఇందులో L అనేది సర్వీస్ ప్రొవైడర్ ను M అనేది ప్రాంతాన్ని తెలియజేస్తుంది.

1/3 Pages

ఉదాహరణకు AA-xxxx అనే పేరుతో మనకు ఓ మెసేజ్ వచ్చింది అనుకుందాం. దాని ప్రకారం అందులో మొదటి A. మనం వాడే నెట్ వర్క్ ను, రెండవ A మనం ఉండే ప్రాంతాన్ని తెలియజేస్తుంది. అంటే సదరు మెసేజ్.. ఎయిర్ టెల్ నుండి ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుండి పంపబడింది అని అర్థం. ఈ లిస్ట్ ఫాలో అయితే మరిన్ని విషయాలు క్లియర్ గా అర్థం అవుతాయి.

#మనం వాడే నెట్ వర్క్ కోడ్స్:
#ప్రాంతాల వారిగా ఇచ్చే కోడ్స్:

దీనిని బట్టి మనకు LM-xxxx అనే మెసేజ్ వచ్చినట్టయితే. అది BPL నెట్ వర్క్ నుండి ముంబై ప్రాంతం వారికి వచ్చినట్లు గుర్తించాలి.

మరో విషయం ఏంటంటే. LM-1234, LM-2345 ఇలా అనేక నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్వీస్ కి, ఒక్కో టైప్ మెసేజ్ కి ఒక్కో నెంబర్ ఇస్తు ఉంటారన్న మాట.

English summary

What is the meaning of LM-xxxx and AD-xxxx messages