కలలో పెళ్లి జరుగుతున్నట్లు, మంగళ వాయిద్యాలు వస్తే మీకేం జరుగుతుందో తెలుసా?

What is the meaning when marriage get into dreams

11:39 AM ON 6th October, 2016 By Mirchi Vilas

What is the meaning when marriage get into dreams

పెళ్లి ఈడు వస్తే పప్పన్నం ఎప్పుడు అని అడుగుతారు అందరూ. పెళ్లి కుదిరితే, పెళ్లి కళ వచ్చేసిందే బాలా అంటూ ఓ పాట వేసుకోవడం షరా మామూలే. కానీ మనకు వచ్చే కలల్లో పెళ్ళికి సంబంధించి కల వస్తే, ఏమవుతుంది అనే దాన్నిపై రకరకాల వ్యాఖ్యానాలు వున్నాయి. అసలు శుభాలకి సంబంధించిన కలలు మంచి ఫలితాలనే ఇస్తాయని పండితులు అంటున్నారు. అయితే వీటిలో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన కలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో యువతులకి వచ్చే కొన్ని శుభాలతో కూడిన కలలు త్వరలో వారి వివాహం జరగనుందనే విషయాన్ని సూచిస్తూ ఉంటాయి.

మంగళ వాయిద్యాలు ఎదురైనట్టుగా, తమ ఇంటికి మామిడితోరణాలు కట్టినట్టుగా కల వస్తే ఆ ఇంటి పెళ్ళి భాజాలు మోగడం తప్పనిసరి అని పంచాంగ నిపుణులు అంటున్నారు. నెమలిని కలలో చూసినట్లైతే విశేష లాభము కలుగును. వివాహము కాని వారికి నెమలి కలలో కనిపిస్తే త్వరలో వివాహము జరుగును. అత్తవారి మూలముగా విశేష ధన లాభము కలుగుతుందని అంటారు. పెళ్లి వయసుకు రాని వాళ్లకు, వృద్ధులకు పెళ్లి అయినట్లు కల వస్తుంటుంది. ఈ వయసులో ఇలాంటి కలలు ఏమిటి? అని ఆశ్చర్యపోతుంటారు. కలలో పెళ్లికి రకరకాల అర్థాలు ఉన్నాయి.

తన కుటుంబ సభ్యులకు దూరంగా వెళుతున్నట్టుగా, తాను మరొకరి ఇంటిలో దీపం వెలిగిస్తున్నట్టుగా, బంగారు ఆభరణాలు ధరించినట్టుగా, చేతి నిండుగా గాజులు వేసుకుంటున్నట్టుగా, ఆలయంలో అమ్మవారిని దర్శించి ఆమె ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా యువతులకు కలలో కనిపిస్తే త్వరలోనే వారి వివాహమవుతుందని అంటారు.

1/4 Pages

ఒకటి..


కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు నచ్చకపోయినా ఆమోదించాల్సి వస్తుంది. కారణం ఏదైనా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాను? తీసుకోవాల్సింది కాదు... ఇలా మనసులో ఆలోచనలు సుడి తిరుగుతుంటాయి. ఈ ఆలోచన తీవ్రత కలగా మారుతుంది. కలలో... పెళ్లి పందిరి చుట్టుపక్కల ఆనందం వెల్లివిరుస్తుంటుంది. ఇందుకు విరుద్ధంగా వరుడి(లేదా వధువు) ముఖంలో విషాదం తాండవిస్తుంటుంది. ఇక్కడ పెళ్లి అనేది ఒక నిర్ణయమైతే, దాని మీద అనిష్టం అనేది వరుడు/వధువు ముఖంలో కనిపించే విషాదంగా చెబుతారు.

English summary

What is the meaning when marriage get into dreams