మేయర్ అనూరాధ దంపతుల హత్యకు కారణమేంటి ?

What is the Mistry behind Chitoor Mayor Couple's Dearh?

02:35 PM ON 18th November, 2015 By Mirchi Vilas

What is the Mistry behind Chitoor Mayor Couple's Dearh?

రాష్ట్రమంతా సంచలనం రేపిన చిత్తూరు నగర మేయర్‌ కటారి అనూరాధ , మోహన్ దంపతుల హత్య ఘటన కు సంభందించి, పోలీసులు అన్నికోనాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్లు , అందులో ముగ్గురు పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన వారెవరు , అందుకు గల కారణం ఏమిటి అనే విషయాలు తెలియాల్సి వుంది. పట్టపగలు , అందునా కార్పోరే టర్లు అంతా చూస్తుండగానే క్షణాల్లో చోటుచేసుకున్న ఈఘాతుకం అందరినీ కలచివేసింది. మొత్తం ఐదుగురు వ్యక్తులు వచ్చి , అందులో ఇద్దరూ ముందుగానే కార్పోరేషన్ కార్యాలయంలోకి వెళ్లి , పరిస్తితి గమనించాక , మిగిలిన ముగ్గరు బురఖాలు ధరించి , మేయర్ చాంబర్ లోకి చొరబడి , మేయర్ అనూరాధ నుదిటిపై గన్ ఎక్కుపెట్టి , కాల్చేశారు , దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆమె ప్రాణాలు విడిచారు.హంతకులు మేయర్ ని కాల్చిన మరుక్షణం , ఆపక్కనే వున్న ఆమె భర్త మోహన్ పై దాడికి దిగారు తప్పించుకో బియినా సరే వెంబడించి మరీ , కత్తులతోదాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్ పరిస్తితి విషమంగా మారడం , ఆసుపత్రిలో చికిత్స అందించినా ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు.

వాస్తవానికి మేయర్ చాంబర్ దగ్గర బంట్రోతు అడ్డుకున్నా , దుండగులు లోపలకు చొచ్చుకు వాచ్చారట. మేయర్ భర్తను ఎలేర్ట్ చేయడం , కింద వున్న అతని మనుష్యులకు వర్తమానం అంది పైకి వచ్చే లోగానే అంతా అయిపొయింది. తలుపులు మూసేసినా హంతకులు వేరే దారి గుండా వెళ్లి, గోడ దూకి పారిపోయారు. చివరకు ముగ్గరు నిందుతులు పోలీసులకు లొంగిపోయారు. ఆనుపానులు కంటిపెట్టి , అత్యంత పగద్బందీగా హత్య చేసారంటే , దీని వెనుక రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయన్న అనుమానం తో పోలీసులు ఆదిశగా ద్రుష్టి సారించారు. అయితే రంగంలోకి దిగిన క్లూస్ టీం , జాగిలాల నేపధ్యంలో జాగిలాలు నేరుగా చింటూ అనే వ్యక్తి ఇంటివైపు దారితీయడంతో వెంటనే పోలీసులదృష్టి చింటూపైకి మళ్లింది. మరోవైపు మోహన్‌, అనూరాధల దారుణ హత్య వార్త తెలియగానే.. వారి అనుచరులు చింటూ కార్యాలయంపై దాడిచేసి వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇంతకీ చింటూ ఎవరు.. ఈ హత్యలతో సంబంధం ఏమిటనేది చర్చకు దారితీసింది.

మెరైన్‌ ఇంజనీరింగ్‌ చదివి..

చింటూ అసలుపేరు చంద్రశేఖర్‌. మేయర్‌ అనూరాధకు మేనల్లుడు. ఆమెభర్త మోహన్‌ అక్క సక్కుబాయి కుమారుడు. మెరైన్‌ ఇంజనీరింగ్‌ చేసి , ముంబైలో ఉద్యోగం చేసుకొంటు న్నాడని అంతా అనుకొన్న చింటూ పేరు..తొలిసారి 2007లో తెరమీదికి వచ్చింది. అదికూడా . మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై ఆ ఏడాది రెండుసార్లు హత్యా ప్రయత్నం చోటుచేసుకున్న నేపధ్యం కావడం విశేషం. సీకేబాబుని టార్గెట్‌ చేసింది చింటూ నేనని అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. 2005లో చింటూ మేనమామ, టీడీపీ నేత కటారి మోహన్‌పై హత్యాయత్నం జరిగింది. దీనికి ప్రతీకారంగానే సీకేబాబుని చింటూ చంపాలని చూశాడంటూ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మేనమామతోపాటు అజ్ఞాతంలో ఉన్న చింటూ, 2011లో జిల్లాకు వచ్చేశాడు. ఒకవైపు కేసుల్లో విచారణకు హాజరవుతూ, మరోవైపు సొంత వ్యాపారాలను వృద్ధి చేసు కొన్నాడు. రాజకీయ దృష్టితో చింటూ,బలిజ యువజన సేవాసమితిని నడిపిస్తున్నాడు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మేనత్త అనూరాధ చిత్తూరు నగర మే యర్‌ అయ్యారు. అప్పటినుంచి జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలన్న చింటూ ఉబలాతానికి కటారి కుటుంబం నుంచి సానుకూలత లభించలేదని చెబుతున్నారు. కార్పొరేషన్‌ వ్యవహారాల్లో, నగర రాజకీయాల్లో జోక్యంకోసం ఉత్సహపడిన చింటూ... కటారి మోహన్‌ కుటుంబం తీరుతో నిస్పృహకు లోనయ్యాడనే ప్రచారం. ఇలా ఒకనాడు ఏ కుటుంబానికైతే కండ బలాన్ని అందించాడో వారిపైనే కత్తి దూసే పరిస్థితి! అది ఎంతదూరం పోయిందంటే.. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో మేనత్త మీద లెక్కకు మిక్కిలిగా చింటూ ఫిర్యాదు చేశాడు. మేయర్‌ వాహనానికి నిబంధనలకు విరుద్ధంగా బ్లూ లైట్‌, సైరన్‌ వినియోగిస్తున్నారనేది.. ఆయన చేసిన ఫిర్యాదుల్లో మచ్చుకు ఒకటి. మున్సిపల్‌ ఎన్నికల్లో చింటూ సహకారం తీసుకొని, ఆ తరువాత విస్మరించారనేది చింటూ అనుచరుల వాదన. ఇలా కుటుంబ పోరు ముదిరిన ఫలింగానే మంగళవారం కటారి అనూరాధ, మోహన్‌లు దారుణంగా అంతమయ్యారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారన్న వార్తలు వస్తున్నాయి. మేయర్ అనూరాధ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు గతంలో పెళ్లి చేయగా , ఇటీవలే కుమారుడి వివాహం కూడా అయింది.

కాగా కార్పొరేషన్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన మేయర్ కటారి అనురాధ మృతదేహానికి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ పూర్తి అయ్యింది. అనురాధ ఎడమకంటి నుంచి మెదడులోకి బుల్లెట్ దూసుకెల్లిందని దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదకలో వెల్లడైంది. ప్రజల సందర్శనార్థం అనురాధ భౌతికకాయాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఉంచారు. పలువురు శ్రంద్ధాంజలి ఘటించారు. సాయంత్రం అధికార లాంచనాలతో అత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అనురాధ దంపతుల హత్యకు నిరసనగా కాపునాడు నేతలు ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది..

English summary

What is the Mistry behind Chitoor Mayor Couple's Dearh?