'ఓంకార్' తరువాత సినిమా ఏంటి??

What is the next movie of Omkar

03:38 PM ON 10th January, 2016 By Mirchi Vilas

What is the next movie of Omkar

చిత్ర నిర్మాతగా మారిన టీవి యాంకర్ 'ఓంకార్' తన తరువాత సినిమా కి సన్నాహాలు చేస్తున్నాడు. తక్కువ బడ్జెట్ తో తీసినా బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'రాజు గారి గది' సీక్వెల్ కానీ, లేదా కమర్షియల్ టచ్ తో ఒక కుటుంబ కధా చిత్రాన్ని కానీ తెరకెక్కించనున్నాడు. 'రాజు గారి గది' సీక్వెల్ స్క్రిప్ట్ తో ఓంకార్ సిద్ధంగా ఉన్నాడు. రాజు గారి గది ద్వారా లాభాలు పొందిన నిర్మాతలు ఈ సినిమా నిర్మించడానికి ముందడుగు వేస్తున్నారు. ఇంకో కుటుంబ కధా చిత్రానికి కూడా స్క్రిప్ట్ రెడీ చేశాడు. తన నెక్స్ట్ సినిమా ని ఈ సమ్మర్ కి రిలీజ్ చెయ్యాలని గట్టి నిర్ణయంతో ఉన్నాడు ఓంకార్. అయితే ఈ రెండు సినిమా ల్లో ఏదో ఒకటి ఈ నెలాఖరుకి ఫైనల్ చెయ్యనున్నాడు.

ఫైనలైజ్ చేసిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెడతాడు. ఓంకార్ మాట్లాడుతూ నేను ఈ సినిమా ను హడావిడిగా తియ్యలేను, ఎందుకంటే రాజు గారి గది సినిమా నాకు నిర్మాతగా ఒక మంచి మార్కును క్రియేట్ చేసింది, దానిని పోగొట్టుకోను అని చెప్పారు. అయితే రాజు గారి గది సీక్వెల్ ను ఇతర బాషలలో కూడా చిత్రీకరించే ఆలోచనలో ఓంకార్ ఉన్నట్లు తెలుస్తుంది.

English summary

Tv anchor Omkar turned as a producer and director with Raju Gaari Gadhi movie. It is a horror comedy movie and it is one of the block buster movie in horror movies.