ఆశ్వయుజ మాస ప్రత్యేకత ఏమిటో తెలుసా?

What is the special of Aswayuja Masam

02:32 PM ON 1st October, 2016 By Mirchi Vilas

What is the special of Aswayuja Masam

తెలుగు మాసాలలో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత వుంది. అందునా త్రిముర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి, మహాలక్ష్మీ, పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన, వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం అని చెప్పాలి. జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్ధం, తొమ్మిది అవతారలను ధరించిన మాసం ఇది. ఆయుర్వేద దేవుడుగా చెప్పే ధన్వంతరీ, త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మద్వాచార్యులు జన్మించిన మాసం కూడా ఇదే. దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము కూడా ఇదేనని తెలుసుకోమని పెద్దలు చెబుతారు. ఇక ఈ మాసంలో చేసే పూజలు, విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.

1/5 Pages

ఆశ్వయుజ మాసంలోని తొలి తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు అంటారు కదా. చాలా నిష్టగా, సంప్రదాయబద్ధంగా పూజలు చేయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి, ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమంగా ఆరాధించాలి. దేవి పూజను ఆశ్వయుజ మాసం అష్టమి, నవమిలలో పూజించిన భక్తులను ఎటువంటి సోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది.

English summary

What is the special of Aswayuja Masam