ఏకాకి అయిన పాక్ చేసేదేమిటి?

What Pakistan position now

05:22 PM ON 1st October, 2016 By Mirchi Vilas

What Pakistan position now

ఓర్పు - సహనం వదిలేస్తే ఏమవుతుందో రుచి చూపిస్తూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన మెరుపుదాడిలో సుమారు 40 నుంచి 70 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరంతా జైషే-ఇ-మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన వారే. భారత్ పై తన అక్కసు వెళ్ళగక్కడంలో ముందుండే జైషే-ఇ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ కు ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ ఊహించని పరిణామంగానే చెప్పాలి.

1/6 Pages

రగిలిపోతున్న మసూద్...


భారత్ మెరుపు దాడిలో జైషే-ఇ-మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారే ఎక్కువగా మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో మౌలానా మసూద్ అజహర్ భారత్ పై మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. తన ప్రసంగాలతో కశ్మీర్ లోని ముస్లిం ప్రజలను రెచ్చగొట్టి భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నాడు. భారత్ దాడులను వ్యతిరేకిస్తూ పాక్ లో భారీ ర్యాలీలు నిర్వహించి పాక్ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేసే వ్యూహంలో ఉన్నాడు.

English summary

What Pakistan position now