శ్రీ కాళహస్తి పూజలు చేయించుకున్నవారు తిరుమల ఎందుకు వెళ్ళకూడదు.!

What People were not supposed to visit Tirupati After Visiting Srikalahasti Temple

01:25 PM ON 28th November, 2016 By Mirchi Vilas

What People were not supposed to visit Tirupati After Visiting Srikalahasti Temple

శ్రీవారి దర్శనార్ధం తిరుమల వెళ్లే భక్తులు అక్కడ కు వెళ్ళాక, శ్రీవారి స్పర్శనం మొక్కులు అయ్యాక, చుట్టుపక్కల గల పలు ఆలయాలను దర్శించుకుంటారు. అయితే చాలామంది ముందుగా శ్రీ కాళహస్తి రైల్వే స్టేషన్లో ఉదయాన్నిదిగి స్వామి వారిదర్శనం చేస్కుని అక్కడ నుంచి తిరుమల బయలుదేరుతారు.

శ్రీ కాళహస్తి నుంచి తిరుమలకు సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది.శ్రీ కాళహస్తి నుంచి తిరుమల చేరుకోవడానికి బస్ లో45 నిమిషాల సమయం పడుతుంది.నిజానికి అలా చెయ్యడం వల్ల తిరిగి వారు వెనక్కి వచ్చే పని ఉండదు. అలా చేయకపోతే, తిరుమల నుంచి వెనక్కి(శ్రీ కాళహస్తి )వచ్చి మళ్ళీ తిరుపతి చేరుకుని చుట్టుప్రక్కల దేవాలయాలు దర్శించుకోవాలి.

శ్రీ కాళహస్తి సర్పదోష ,రాహుకేతు పూజలకు ప్రసిద్ధి.ఈ పూజలు చేయించుకున్నవారు నేరుగా ఇంటికి వెళ్లాలని అక్కడ పూజారులు చెప్తారు. దానివలన చాలామంది శ్రీ కాళహస్తి లో ప్రత్యేకంగాపూజలు చేయిస్తే, ఇక ఎక్కడకి వెళ్లకుండా ఇంటికి ప్రయాణం అవుతారు.

English summary

Here is the reason why people werenot supposed to visit Tirupathi after the Visit of Sri Kalahasthi Temple.