యక్ష ప్రశ్నలు అనే పదం విని ఉంటారు కదా! అసలు అవి ఏంటో తెలుసా?

What Was Yaksha Prashnalu Means

06:01 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

What Was Yaksha Prashnalu Means

సాధారణంగా మనం అడిగే ప్రశ్నలకు ఎదుటివారు సమాధానం చెప్పలేకపోతే వారు ' నీ యక్షప్రశ్నలు ఏంటి' అని అంటూంటారు . అసలు ఆ యక్ష ప్రశ్నలు అంటే ఏంటి, వాటిని ఎందుకలా అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

మహాభారతం లోని అరణ్య వాసంలో పాండవులు ఉన్నప్పుడు అగ్నిహోత్రుడు అనే ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన సమిధులు ఒక జింక కొమ్ములలో ఇరుక్కుపోయిందని. దానిని తీసుకువచ్చి తనకు ఇవ్వల్సిందిగా బ్రాహ్మణుడు కోరాడు. అప్పుడు వెంటనే ధర్మరాజు, అతని నలుగురు సోదరులు ఆ జింకను పట్టుకోవడానికి బయలుదేరారు , వారు చూస్తుండగానే ఆ జింక ఉన్నట్టుండి మాయమై పోయింది. ఆ జింక కోసం వెతికి వెతికి అలసిపోయిన వారు వారిలో ఒకరైన నకులుడిని మంచినీళ్ళు తీసుకురమ్మని పంపిస్తారు. మంచి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిన నకులుడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో వెళ్ళిచూసి రమ్మని సహదేవుని పంపిచారు. అదే విధంగా అర్జునుడు, ఆ తరువాత భీముడు వెళ్ళారు వారు కూడా ఎంతకీ తిరిగిరాకపోవడంతో చివరకు ధర్మరాజు అక్కడికి వెళ్ళి చూడగా మంచినీటి కొలను ప్రక్కన ఉన్న తన నలుగురు సోదరులు పడి ఉండడం చూసి ధర్మరాజు దు:ఖంతో విచారిస్తుండగా అంతలో ఆకాశంలో అదృశ్యవాణి పలుకుతూ ఓ ధర్మరాజా నేను యక్షకుడిని ఈ మంచినీటి సరస్సు నా ఆధీనంలో ఉంది. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా నీ సోదరులు అహంకారంతో దాహం తీర్చుకోవడానికి ప్రయత్నించడం వల్లనే వారికి ఈ గతి పట్టింది. నీవైనా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నీదాహం తీర్చుకో అని యక్షుడు అనగా ధర్మరాజు సరే అన్నాడు. ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో వచ్చి ధర్మరాజును మొత్తం 72  చిక్కు ప్రశ్నలను ఆడుగుతాడు వాటి కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

1. భూమికంటే భారమైనది ఏది ? 

జ: తల్లి

English summary

Let us know that what was yaksha prashnalu and who asked to whom this yaksha prashanalu. Yaksha asked these 72 Yaksha Prashnalu to Dharma Raju in Maha Bharatam Episode