కాకి తల మీద వాలితే చనిపోతారా?

What will happen if crow will fly on human head

02:35 PM ON 1st September, 2016 By Mirchi Vilas

What will happen if crow will fly on human head

కాకి తల మీద పడితే మరణమని, లేదా తల స్నానం చేయాలని కొంతమంది పెద్ద వాళ్ళు చెప్తుంటారు. అయితే ఈకాలంలో ఇంకా ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్ముతున్నారా అంటూ నవ్వుతారు. కాని దీని వెనుక సైన్స్ దాగి వుంది. అవును మన పూర్వీకులు, పెద్ద వాళ్ళు చేసే తప్పేంటో తెలుసా? పిల్లలకు అలా చెప్పినప్పుడు ఎందుకు అలా చేస్తున్నారో చెప్పరు. ఉదాహారణకు మనం గుమ్మాలకు పసుపు రాస్తాం. ఎందుకు అని అడిగితే చెప్పరు. అందుకే దానిని ఒక మూఢ నమ్మకం అని చెప్పి వదిలేస్తారు ఇప్పుడు వున్న కుర్రవాళ్ళు. అదే పసుపు క్రిమి సంహారిణి. అది రాయడం వల్ల బయట నుంచి వచ్చే క్రిములు నాశనమవుతాయి అని చెప్తే నమ్ముతారు కదా. సేమ్ టు సేమ్ అలాగే కాకి తల మీద పడితే స్నానం చేయాలి.

ఎందుకంటే కాకి కుళ్ళిన ఆహారాన్ని తింటుంది. అలా తిన్నప్పుడు తన కాలికి, వంటికి, ముక్కుకి ఆ క్రిములు అంటుకుంటాయి. సో అది మనల్ని గీరినప్పుడు, పోడిచినప్పుడు, వాలినప్పుడు ఆ క్రిములు ఎక్కడ మనకు అంటుకోని వుండిపోతాయేమోనని పెద్దలు తలస్నానం చేయమంటారు. ఇది పిల్లలు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే. ఇక మరణం విషయానికి వస్తే ఇది జ్యోతిష్యులు కూడా ఈ విషయాన్ని కొట్టిపారేసారు. కాని మన పూర్వీకులు కాకి రూపంలో మనకు కలుసుకోవచ్చని అందుకే పిండ ప్రధానం చేసినప్పుడు కాకికి పెట్టేలా చేస్తారని, అందుచేత, కాకి మనల్ని తాకినప్పుడు ఒకసారి గుడికి వెళ్ళి 108 ప్రదక్షణలు చేస్తే చాలని జ్యోతిష్యులు చెప్తున్నారు. అందండీ అసలు సంగతి.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: ఫ్రెండ్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న అమల

ఇది కూడా చదవండి: అభిమానికి బంపరాఫర్ ఇచ్చిన రష్మీ!

English summary

What will happen if crow will fly on human head.