వెల్లుల్లి తలకింద గానీ, జేబులో గానీ పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

What will happen if garlic will puts in your pocket

10:59 AM ON 13th August, 2016 By Mirchi Vilas

What will happen if garlic will puts in your pocket

తల్లి చేసే మేలుకన్నా ఉల్లి చేసే మేలు ఎక్కువని అంటారు కదా. ఉల్లి అంటే ఇక్కడ వెల్లుల్లి. అందుకే వెల్లుల్లి మనం సాదారణంగా వంటల్లో వాడతాం. దీనివలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే, వెల్లుల్లిని వంటల్లోనే కాదు, ఇతర విషయాలకు కూడా వాడతారట. అదేమిటో ఓసారి తెలుసుకుందాం. వెల్లుల్లి అనేది ఈ భూమ్మీద దొరికే వస్తువుల్లో అత్యంత ఆరోగ్యకరమైన వస్తువు. దీన్లో ఆరోగ్యకరమైన పోషకాలుంటాయి. అందుకే మనం దీన్ని రోజూ ఆహారంలో తీసుకుంటాం. వెల్లుల్లిని మనం వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు నివారిణిగా కూడా ఉపయోగించవచ్చు. కాలేయ సమస్యలను, బట్టతలను రాకుండా చేయడం, ధమనులను శుభ్రపరచడం, జలుబు నుంచి దూరం చేయడం, శ్వాసకోస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

ఈజిప్ట్ వారు పచ్చి వెల్లుల్లిని నములుతుంటారు. అది మంచి యాంటి బయాటిక్ గా పనిచేస్తుందని వారి నమ్మకం. వెల్లుల్లిని క్రష్ చేస్తే దాని పోషకాలు బయటపడతాయి కాని, వంటల్లో వేస్తే, పోషకాలు నాసనమవుతాయి. వెల్లుల్లిని క్రష్ చేసి 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. వెల్లుల్లిని పార్స్లీ ఆకులు, నూనెతో కలిపి తీసుకుంటే దుర్వాసనను దూరం చెయ్యొచ్చు. కొంతమంది పడుకునే ముందు వెల్లుల్లిని తమ తలదిండు కింద పెట్టుకుంటారు. కొంతమంది అదృష్టం కోసమని తమ జేబులో పెట్టుకుంటారు. అందుకే వెల్లుల్లిని మీ దిండు కింద గాని, జేబులో గాని పెట్టుకోండి. అలా చేయడం వలన మీకు మంచి నిద్ర పట్టడమే కాకుండా, వ్యతిరేక శక్తులను దూరం చేస్తుంది. మీకు ఏమైనా డౌటా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది.

English summary

What will happen if garlic will puts in your pocket