తలుపులున్న వైపు కాళ్ళు పెట్టి పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

What will happen if legs towards to door while sleeping

11:44 AM ON 27th July, 2016 By Mirchi Vilas

What will happen if legs towards to door while sleeping

మనిషి జీవితంలో ఎక్కువ భాగం నిద్రకే సరిపోతుంది. దాదాపు జీవితంలో సగభాగం నిద్రలోనే గడిచిపోతుంది. నిత్యం అనేక ఒత్తిళ్లు, ఆందోళనలతో సతమతమయ్యే వారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి, ఇంకా చెప్పాలంటే, ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరమే. నిద్రపోవడం వల్ల మన శరీరం రిలాక్స్ అవుతుంది. మళ్లీ లేచే సరికి ఉత్తేజం, ఉత్సాహం వస్తుంది. బాటరీ ఛార్జి అయినట్లు ఉంటుంది. దీంతో రోజంతా యాక్టివ్ గా పనిచేయవచ్చు. ఇదే కాదు, నిద్రతో మనకు ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. అయితే నిద్రపోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఎవరైనా నిద్రపోయే సమయంలో గదిలో ఏదో ఒక వైపు తలను పెట్టి నిద్రిస్తారు. అయితే పడుకోడానికి ఫలానా దిక్కు మంచిదని, ఇంకో దిక్కు మంచిది కాదని చెబుతుంటారు.

అయితే తల కాకుండా నిద్రించే సమయంలో కాళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలట. అంటే కాళ్లను తలుపులు ఉన్నవైపు కాకుండా వేరే వైపు పెట్టి నిద్రించాలట. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. తలుపులు ఉన్న వైపు కాళ్లను పెట్టి నిద్రించడం వల్ల మన ఒంట్లోకి నెగెటీవ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. దీంతో ఆ రోజంతా మనకు విశ్రాంతి ఉండనే ఉండదట. తీవ్రమైన అసంతృప్తి, ఒత్తిడి, ఆందోళన కలుగుతాయట. అంతేకాదు చనిపోయిన వారి మృతదేహాలను గది నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు ముందుగా కాళ్లను బయట ఉంచుతారు కదా, అందుకే ఆ వైపే మనం కూడా కాళ్లను పెట్టి నిద్రిస్తే దెయ్యాలను ఆహ్వానించినట్టు అవుతుందట. అందుకే ఇది అస్సలు మంచిది కాదట. అందుచేత తలుపుల వైపు కాళ్లను పెట్టి పాడుకోకూడదని అంటారు. మరి పాటిస్తారు కదా..

English summary

What will happen if legs towards to door while sleeping