గర్భిణీలు మునగకాయలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

What will happen if pregnancy women eat drum sticks

11:04 AM ON 25th October, 2016 By Mirchi Vilas

What will happen if pregnancy women eat drum sticks

గర్భిణీలు మునగకాయ తినడం సురక్షితమా కాదా అన్న సందేహం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది. ఆరోగ్యకరమైన కూరగాయల్లో మునగకాయ లేదా మునక్కాడ ఒకటి. మునక్కాడతో తయారు చేసే సాంబార్, సూప్, కర్రీ, వేపుడు ఏవైనా సరే అద్భుతమైన రుచి కలిగి ఉంటాయి. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు, ఆహారాల మీద కోరికలను కంట్రోల్ చేసుకోలేరు. ఎప్పుడూ తినని ఆహారాల మీద కూడా కోరికలు కలుగుతాయి. మునకాడల ములుసు, సూప్ వంటి వాటి మీద మనస్సు పారేసుకోవచ్చు. అయితే గర్భిణీలు మునగకాయ తినడం సురక్షితమా కాదా అన్న సందేహం కూడా ఉంటుంది.

ఎందుకంటే ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది కాబట్టి, తల్లి బిడ్డకు సురక్షితమా కాదా అని ఆలోచించేవారు చాలా మందే ఉంటారు. మునగకాయ, మునగాకు బాగా పాపులరైన గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, వీటిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల వీటిని పురాతన కాలం నుండి వంటల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. అనేక ఔషధ గుణాలు ఉండటం వల్లే సాధారణ వ్యక్తులతో పాటు, గర్భిణీలు కూడా వీటిని తీసుకోవచ్చని పోషకాహర నిపుణులు సూచిస్తున్నారు. అయితే శరీరంలో వేడి కలిగించే స్వభావం ఉండటం వల్ల మితంగా తీసుకోవడం మంచిది.

అలాగే ఏ కూరగాయలైనా వండటానికి ముందు శుభ్రంగా కడిగి తరువాత ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి హానికరమైన పారాసైట్స్, బ్యాక్టీరియా, క్రిమిసంహారక మందుల ప్రభావం ఉండదు. ఇవి గర్భిణీలకు హాని కలిగిస్తాయి, వండటానికి ముందు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఉపయోగించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో వారికి కావల్సిన క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. బాడీ ఫిట్ గా ఉంటుంది. ఇంకా మరికొన్ని కామన్ ప్రయోజనాల గురించి, పరిశీలిద్దాం.

1/9 Pages

1. సుఖ ప్రసవం...


మునక్కాయను గర్భిణీల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది యుటేరియన్ కాంట్రాక్షన్ మెకానిజం సపోర్ట్ చేస్తుంది. ప్రసవంలో నొప్పులను తగ్గించి సుఖ ప్రసవానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రసవం తర్వాత, ప్రసవానికి ముందు రక్తస్రావం కాకుండా నివారిస్తుంది.

English summary

What will happen if pregnancy women eat drum sticks