కాలసర్ప దోషం ఉంటె .. ఏం జరుగుతుందో తెలుసా

What will Happen If There Was Kala Sarpa Dosha

11:38 AM ON 11th January, 2017 By Mirchi Vilas

What will Happen If There Was Kala Sarpa Dosha

మన వాళ్లకు సెంటిమెంట్లు,నమ్మకాలు ఎన్నో వున్నాయి. మనం నమ్మే అనేక విశ్వాసాల్లో జ్యోతిషం కూడా ఒకటి. పుట్టిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం జరగాలన్నా, ఎవరైనా వ్యక్తులకు ఎప్పుడూ కష్టాలు కలుగుతున్నాయంటే వారు జాతకం చూసి అందుకు అనుగుణంగా శాంతి చేయించడం రివాజు. అయితే చాలా మంది జాతకాల్లో కాలసర్ప దోషం అని ఒకటి ఉంటుంది. అది ఉంటే అనేక మంది భయపడిపోతారు. తమకు అంతా చెడు జరుగుతుందని జంకుతారు. దీంతో శాంతి పూజలు చేయిస్తారు. అయితే నిజానికి కాలసర్ప దోషం వల్ల చెడు ఫలితాలు మాత్రమే కాదు, అప్పుడప్పుడు మంచి ఫలితాలు కూడా కలుగుతాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొత్తం నవ గ్రహకూటమిలో రాహు, కేతువులు కాకుండా, మిగిలిన 7 గ్రహాలూ ఆ రెండు గ్రహాల చట్రంలో ఇరుక్కుపోతే దాంతో కాలసర్ప దోషం వస్తుంది. ఆ సమయంలో జన్మించిన వారికి ఈ దోషం కలుగుతుందని, అంటారు. అయితే దోషం మాట వాస్తవమే గానీ దీంతో ఎప్పుడూ చెడు ఫలితాలు కలగవట. కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయట. అంతెందుకు, ధీరూభాయ్ అంబానీ, సచిన్ టెండుల్కర్, లతా మంగేష్కర్, జవహర్ లాల్ నెహ్రూ వంటి గొప్ప వ్యక్తులకు కాలసర్ప దోషం ఉండేదట. కానీ నిజానికి చూస్తే వారు తమ తమ రంగాల్లో ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగారు. చాలా పేరు తెచ్చుకున్నారు. కీర్తి గడించారు. ఈ క్రమంలో కాలసర్ప దోషం ఉన్నా అంతగా భయపడాల్సిన పనిలేదని పలువురు పండితులు చెబుతున్నారు. కష్టపడి పని చేసే వారికి ఆ దోషం ఉండదని, జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిర పడతారని వారు చెబుతున్నారు.

1/7 Pages

1. కాలసర్ప దోషం ఉన్నవారు పనిలో అంకిత భావంతో ఉంటారట. ధైర్యం, నిజాయితీ కలిగి ఉంటారట. ఇవే వాళ్ళను ఉన్నత స్థానాల్లో నిలబెడతాయట.

English summary

Hindu's in India believe so many things and Kala Sarpa Dosha was one of the things which Hindus Believe. If the person have kala sarpa dosha what will happen and here is the answer for that.