పాము కాటేస్తే చనిపోతాం.. అదే పాము విషం తాగితే ఏమౌతుందో తెలుసా?

What will happen if we drink snake poison

02:29 PM ON 14th September, 2016 By Mirchi Vilas

What will happen if we drink snake poison

ఈ భూమిపై మనుషులతో పాటూ ఎన్నో జంతువులూ, పక్షులు నివసిస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఎన్నో వేల జాతుల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని పెద్దవిగా ఉంటే మరికొన్ని చిన్నవిగా ఉన్నాయి. కొన్ని విషం కలిగి ఉంటే, కొన్ని విషం లేనివి ఉన్నాయి. ఇందులో విషం ఉన్న పాము ఏది కుట్టినా మనకు ప్రాణాలు పోవడం ఖాయం. సరైన సమయంలో స్పందించకపోతే మృత్యువు కబళిస్తుంది. అయితే విషం ఉన్న పాముల్లోనూ కొన్నింటి విషం మరీ డేంజర్ గా ఉంటుంది. ఆ పాములు కుడితే క్షణాల్లోనే ప్రాణం పోతుంది. అయితే విషం ఉన్న ఏ పాము కుట్టినా దాని ప్రభావాన్ని బట్టి వ్యక్తులు చనిపోవడమే లేదంటే ప్రాణాపాయ స్థితికి చేరుకుని అనంతరం చికిత్స వల్ల బతకడమో జరుగుతుంది.

అయితే పాము విషాన్ని మింగితే మాత్రం ఎవరూ చనిపోరట. ఇదేమిటని ఆశ్చర్యపోవచ్చు గాక, కానీ ఇది నిజమేనట. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

1/7 Pages

సాధారణంగా ఈ భూమిపై ఉన్న ఏ పాము అయినా 3 రకాల విషాలను కలిగి ఉంటుందట. అవి 1. హెమోటాక్సిక్ వీనమ్. 2. సైటోటాక్సిక్ వీనమ్. 3. న్యూరోటాక్సిక్ వీనమ్.

హెమోటాక్సిక్ విషం ఉన్న పాములు కుడితే ఆ విషం గుండెపై ప్రభావాన్ని చూపుతుందట. ఆ విషం రక్తనాళాల ద్వారా గుండెకు ప్రవహించి గుండెను వెంటనే ఆపేసినంత పనిచేస్తుందట. ఇక సైటో టాక్సిక్ విషం ఉన్న పాములు కుడితే శరీరంలో ఉన్న కండరాలు పక్షవాతం వచ్చినట్టు పడిపోతాయట. చివరిగా న్యూరో టాక్సిక్ విషం ఉన్న పాములు కుడితే శరీరంలోని నాడీ వ్యవస్థ దెబ్బ తింటుందట. ఫలితంగా మెదడు పనిచేయడం ఆగిపోయి ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందట.

English summary

What will happen if we drink snake poison. If we drink any dangerous snake poison with mouth nothing will happen. But if any unhealthy people drunk the poison it is more dangerous to them. If any healthy person drunk the poison his body can create anti dose for snake bite.