దేవుడికి మొక్కు చెల్లిస్తామని చెల్లించకపోతే ఏమౌతుంది?

What will happen if we will not achieve the things for God

02:41 PM ON 6th September, 2016 By Mirchi Vilas

What will happen if we will not achieve the things for God

ఇది ఎంతో మందిని వేధించే ప్రశ్న? దేవుడిని నమ్మే ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక చోట మొక్కు చెల్లిస్తానని గాని, చెల్లించడం గాని జరిగే ఉంటుంది. జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పలానా పని జరిగితే.. పలానా మొక్కు చెల్లిస్తామని ఆ పరమాత్ముడిని వేడుకునే ఉంటాం. అలా మొక్కుకున్నాక చెల్లిండం మరచిపోయినా, లేదా చెల్లించలేకపోయినా అరిష్టమేనట. కాబట్టి దేవుడికి చెల్లించగలిగే మొక్కులు మాత్రమే మొక్కుకోవాలి. భగవంతుడికి మొక్కుకున్నాక ఆ కోరిక తీరినా తీరకపోయినా మొక్కు చెల్లించాలి. అప్పుడు ఆ భగవంతుడే మనకు బాకీ పడతాడు. అప్పుడు నీవు మొక్కుకున్న కోరికను తీరేలా కూడా ఆ భగవంతుడు చేయవచ్చు.

మొక్కు అనేది ఓ ప్రతిజ్ఞ... మానసికంగా ఇది ఎంతో ప్రభావం చూసిస్తుంది. మొక్కు తీర్చకపోతే మనుసులోని ఆ బాధ పదే పదే హెచ్చరించి మనిషికి ఉన్న పాజిటివ్ ఎనర్జీని హరిస్తుంది. తనపై తనకున్న నమ్మకాన్ని పోగొడుతుంది. భయంతో దారి తప్పుతాడు. చివరకు ఎక్కడికక్కడ దెబ్బతింటాడు. సైక్లాజికల్ గా జరిగేది కూడా ఇదే, అందుకే మొక్కులు అనేవి ఎంతో ఆలోచించి మొక్కుకోవాలి తద్వారా అవి ఇచ్చే ఎనర్జీతో కావలిసినవి పొందవచ్చు అనంతరం మొక్కులు కూడా తీర్చవచ్చని అనుభవం కల్గినవారు అంటారు.

ఇది కూడా చదవండి: షాకింగ్: దానికి ఓకే చెప్పిన నిత్యామీనన్!

ఇది కూడా చదవండి: సమంత రెండేళ్ల క్రితమే కోడలిగా ఫిక్స్ అయిందా?

ఇది కూడా చదవండి: అగ్ర రాజ్య నేతకు షాకిచ్చిన చైనా

English summary

What will happen if we will not achieve the things for God