కలలో మీరు గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

What will happen if you did horse riding in dream

10:48 AM ON 8th October, 2016 By Mirchi Vilas

What will happen if you did horse riding in dream

కలలు రావటమనేది మనిషన్నాకా అతి సహజం. మనస్సుకు సంబంధించిన ఈ విషయం మీద ఈనాటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పూర్వకాలంలోనే కాక ఈనాడు కూడా కొన్ని రకాల కలలొస్తే కొన్ని కొన్ని ఫలితాలు ఉంటాయని అందరూ అనుకోవటం కనిపిస్తూ ఉంటుంది. ఈ కలల గురించి అగ్ని పురాణంలో కొంత వివరణ ఉంది. ముఖ్యంగా గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు, గుర్రంతో కలిసి ఈత కొడుతున్నట్లు, గుర్రం పరుగెడుతున్నట్లు, ఇలా రకరకాలుగా మీ కలలో గుర్రం ఎప్పుడైనా కనిపించిందా? అలా కనిపించడం వెనకాల ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం. గుర్రం అనేది హుందాతనానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక. గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన. కలలో గుర్రం కనిపించడం అనేది విస్తృత పరిధిలో సానుకూల ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా స్వాతంత్య్రం, అధికారం, లైంగిన స్వేచ్ఛ తదితర భావాలకు కలలో గుర్రం ప్రతీకగా నిలుస్తుంది. వివిధ సందర్భాలు, సన్నివేశాలను బట్టి కూడా కలల అర్థాలు మారుతుంటాయి. అవేమిటో చూద్దాం..

1/7 Pages

శ్వేత గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తే..


శ్వేత గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే... మీరు ఆర్థికంగా, మానసికంగా ఆనందంగా ఉన్నారని, కుటుంబ బంధాలు గట్టిగా ఉన్నాయని అర్థం.

English summary

What will happen if you did horse riding in dream