మీరు ప్రేమించిన అమ్మాయి రాఖీ కట్టేస్తే...

What will happen if your crush ties rakhi to your hand

12:56 PM ON 18th August, 2016 By Mirchi Vilas

What will happen if your crush ties rakhi to your hand

అమ్మో ఇలాంటి ఘటన ఎదురైతే ప్రేమించినోడికి దిమ్మ తిరిగిపోద్ది కదా. వినడానికి నవ్వుగా ఉంటుంది కూడా. అసలు రాఖీ పండుగ అంటే. అన్నాచెల్లెల అనురాగానికి ప్రతీకగా నిలిచే పండగ. ఆప్యాయతను గుర్తుచేసుకుని... అభిమానాన్ని రాఖీ అనే బంధంతో గుండెల నిండా నింపుకునే గొప్ప పండగ. అయితే ఈ రక్షాబంధన్ పండుగ వస్తుందంటే చాలు కొందరు కుర్రాళ్లు ఉలిక్కిపడుతున్నారు. రాఖీ పండగ ముందు రోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంతకీ వారెవరంటారా? ఇంకెవరు వన్ సైడ్ లవర్స్.

1/3 Pages

ఒక అమ్మాయిని ప్రేమించి... చనువుగా ఉండి.. స్నేహం చేస్తారు. కానీ ప్రేమను వ్యక్తపరచాలంటే ఏదో తెలియని భయం. చెబితే ఎలా స్పందిస్తుందోనన్న సందేహం. ఈ స్థితిలో ఉన్న అబ్బాయిలకు రాఖీ పండుగ సమీపిస్తున్న కొద్దీ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అప్పటి వరకూ స్నేహంగా ఉన్న ఆ అమ్మాయి ఎక్కడ అన్నయ్య అని రాఖీ కట్టేస్తుందోనని భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతారు. రోజూ ఆ అమ్మాయి పక్కనుంటే చాలనుకునే వారు, రాఖీ పౌర్ణమి అనగానే, ఆ ఒక్కరోజు మాత్రం ఆమె కంటపడకుండా తప్పించుకుని తిరుగుతారు.

English summary

What will happen if your crush ties rakhi to your hand