మనం చనిపోతే ఫేస్‌బుక్‌ అకౌంట్ ఏమౌతుంది?

What will happen our Facebook account after died

12:45 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

What will happen our Facebook account after died

ప్రస్తుత కాలంలో ప్రజలు ఏమి లేకపోయినా ఉంటారేమో కానీ.. చేతిలో సెల్, ఫేస్‌బుక్ లో అకౌంట్ మాత్రం లేకుండా లేరు. సోషల్ మీడియా నేడు విశ్వ వ్యాప్తమైంది. అందులో ఫేస్‌బుక్ కూడా ఒకటి. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా మనం ఈ ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడవచ్చు. చిన్న పిల్లల్ని నుండి ముసలి వాళ్ళ వరకు ఫేస్‌బుక్ లో ఖాతా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లకు కూడా ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉంటుంది. ఫేస్‌బుక్ ఒకటే కాదు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఆర్కుట్, జిమెయిల్ ఇలా ఎన్నో సోషల్ మీడియా వెబ్ సైట్స్ లో ఖాతాలు తెరుచుకుంటున్నారు. ఇలా అనేక సోషల్ మీడియా సైట్లను ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నారు.

అయితే మనిషి చనిపోయిన తర్వాత మీ అకౌంట్ ఏమవుతుంది? అకౌంట్ కలిగిన వ్యక్తి చనిపోయినట్లుగా సోషల్ మీడియాకు తెలియదు కదా.. మరి అలాంటి వారి అకౌంట్లన్నీ ఏమవుతున్నాయి? అనే ఆలోచన మీలో ఎప్పుడూ రాలేదా? వస్తే దానికి సమాధానం తెలుసుకున్నారా? తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఆ వివరాలన్నింటిని ఫేస్‌బుక్ ఇటీవల వెల్లడించింది. దాదాపు 3 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు చనిపోయిన వారివేనని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. అంతేకాదు, రోజుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్లు చనిపోతున్నారని కూడా ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది.

ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న వ్యక్తి తను చనిపోతే ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఉంచాలా, వద్దా అనే విషయాన్ని తెలుపవచ్చని తెలియజేసింది. ఇందుకు సంబంధించి 'లెగసీ కాంటాక్ట్' అనే ఆప్షన్ అందుబాటులో ఉన్నట్లు ఫేస్‌బుక్ ప్రతినిధులు తెలియజేసారు. ఇదండీ అసలు విషయం.. తెలుసుకున్నారు కదా, మరి మీరు కూడా ఒకసారి ఆ ఆప్షన్ ని చూసేయండి.

English summary

What will happen our Facebook account after died. This is the doubt for all facebook account holders and users. Now you can know the answer by this.