ఆడవారికి కుడి కన్ను, మగవారికి ఎడమ కన్ను అదిరితే జరిగే అనర్ధాలేంటి?

What will happened if eyes was blinked

03:35 PM ON 26th September, 2016 By Mirchi Vilas

What will happened if eyes was blinked

ఆడవారికి కుడి కన్ను, మగవారికి ఎడమ కన్ను అదరడం వలన అనర్ధాలు జరుగుతాయని చాలా మంది నమ్మకం. మన సాంప్రదాయ శకున శాస్త్రంలో కూడా ఈ విషయం ఉందని అంటారు. ఎడమకన్ను సీతాదేవిని రావణాసురుడు అపహరించే ముందు ఆమెకు కుడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. రావణ సంహారానికి ముందు రాముడు లంకలోకి ప్రవేశించగానే రావణుడికి ఎడమకన్ను, సీతకి ఎడమకన్ను అదిరాయట. ఆ కాలం నుంచే కన్ను అదరటం వలన జరిగే శుభ, అశుభ శకునాలను అంచనా వేసేవారు.

1/2 Pages

ఆరోగ్య కారణాలు కూడా కావొచ్చు..


కళ్ళు అదరడం శకునంగా అయితే ఒక లిప్త కాలంగా జరుగుతుంది. కానీ గంటల తరబడి కన్ను అదరడం అనారోగ్యానికి సూచిక. నిద్ర సరిపోకపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధమైన రోగాల వల్ల కూడా కన్ను అదరటం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే అది తత్తరపాటు వలన జరిగిందో, లోపం వలన జరిగిందో తెలుసుకుంటే మంచిదని అంటున్నారు.

English summary

What will happened if eyes was blinked