గర్భిణీలు పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమౌతుందో తెలుసా?

What will happens if pregnancy women eat onions

10:57 AM ON 24th October, 2016 By Mirchi Vilas

What will happens if pregnancy women eat onions

ఉల్లిపాయల్లో విటమిన్ సి, బయోటిన్, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బి6, ఫొల్లెట్, మొదలగునివి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలామంది పూర్వం గంజి అన్నంలో గానీ, మజ్జిగ అన్నంలో గానీ ఉల్లిపాయో, మిరపకాయో నంజుకోవడం అలవాటుగా ఉండేది. ఇప్పుడు కూడా సహజంగా చాలా మందికి భోంచేసే సమయంలో ప్లేట్ లో పక్కన ఒక ఉల్లిపాయ ముక్క నంజుకోవడం చూస్తుంటాం. అయితే కొంత మంది బిర్యాని, పలావ్ వంటి వంటలకు సైడ్ డిష్ లుగా రైతా, పెరుగుపచ్చళ్లు, సలాడ్స్ వంటి వాటిలో పచ్చి ఉల్లిపాయలను జోడించి తీసుకోవడం సహజం.

అయితే ఇలా పచ్చి ఉల్లిపాయను తినడం గర్భిణీ స్త్రీలకు సురక్షితమా? పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పుట్టబోయే బిడ్డకు సురక్షితమా? ఇటువంటి సందేహం రావడం సహజమే. ఒక్కటి మాత్రం నిజం ఉల్లిపాయల్లో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయ అల్లియం కుటుంబానికి చెందిన హెర్బ్, వెజిటేబుల్. కొన్ని వేల సంవత్సరాల నుండి, ఉల్లిపాయలను పండిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే ఘాటైన వాసన, ముఖ్యమైన ప్రయోజనాల వల్ల వైద్యపరంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయల్లో విటమిన్ సి, బయోటిన్, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బి6, ఫొల్లెట్, మొదలగునివి ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గర్భిణీలకు కూడా సురక్షితమైనవే. కాబట్టి, గర్భిణీలు ఉల్లిపాయలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఏమవుతుందని భావించవచ్చు. అయితే గర్భధారణ సమయంలో ఉల్లిపాయలను తినడం వల్ల పొందే ప్రయోజనాలు:

1/9 Pages

శరీరంను డిటాక్షిఫై చేస్తుంది...


శరీరంలో ఎక్కువ మెటల్ కంటెంట్ ఉండటం తల్లి, బిడ్డకు హానికరం. ఉల్లిపాయల్లో ఉండే అమినో యాసిడ్స్, సిస్టైన్, మెథినైన్ లు శరీరంను నిర్విశీకరణం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయని అంటున్నారు.

English summary

What will happens if pregnancy women eat onions