కాకినాడ సభలో పవన్ చెప్పేదేమిటి? 

What Will Pawan Kalyan Speech About In Kakinada Meeting

11:11 AM ON 8th September, 2016 By Mirchi Vilas

What Will Pawan Kalyan Speech About In Kakinada Meeting

తిరుపతి సభతో ఏపీకి ప్రత్యేక హోదాపై గళమెత్తిన జనసేన పార్టీ అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ ఇక కాకినాడలో నిర్వహించబోయే సమావేశానికి రెడీ అవుతున్నాడు. సడన్ గా తిరుపతి లో సభ పెట్టినా జనం బానే రావడంతో, తనదైన శైలిలో చెణుకులు విసురుతూ, హోదాపై నిలదీసాడు. తొలిదశ పోరాటంగా జిల్లాల వారీగా సభ పెట్టనున్నట్లు ప్రకటించిన పవన్ తొలిసభ కాకినాడలోని పెడుతున్నట్లు ప్రకటించాడు. దీంతో సెప్టెంబర్ 9 సమీపించడంతో కాకినాడలో చురుగ్గా ఏర్పాట్లు చేసేస్తున్నారు. మరికొద్ది గంటల్లో జరగబోయే సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఎండా వాన దృష్టిలో ఉంచుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం మూడంచెల కార్యాచరణను పవన్‌ ప్రకటిస్తూ, కార్యాచరణలో భాగంగా మొదటి సమావేశాన్ని కాకినాడలోని జేఎన్‌టీయూ క్రీడా మైదానంలో నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సభ నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మైదానం 75,000 మందికి సరిపోతుందని అనుమతి లేఖలో నిర్వహకులు తెలిపారని ఆయన అంటున్నారు. దీంతో సభపై అవగాహన కలిగిస్తూ జిల్లాలోని ప్రజలకు జనసేన కార్యకర్తలు అవగాహన కల్పిస్తూ, ర్యాలీలు జరుపుతున్నారు. ఇక పవన్ సభ తర్వాత కేంద్రంలో కదలిక వేగం అయింది. హోదాతో సమానంగా ప్యాకేజి అంటూ కేంద్రం తెలిపిన ప్యాకేజీపై పవన్ స్పందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1997లో కాకినాడలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఎత్తుకుని తీర్మానం చేసిన విషయాన్నీ పవన్ ప్రస్తావిస్తూ, తీర్మానం చేసి దాదాపు 20 ఏళ్ళు అవుతోందని , మరి ఇన్నాళ్లూ ఏరకంగా అభివృద్ధి చేయాలనే దానిపై కసరత్తు ఏమైనా చేసారా అని ఇప్పటికే పవన్ తిరుపతి సభలో ప్రశ్నిస్తూ, అందుకే తొలిసభ కాకినాడలోని జరుపుతున్నట్లు ప్రకటించాడు. దీంతో పవన్ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి:పవన్ తో సీక్రెట్ గా భేటీ అయిన శివాజీ !

ఇవి కూడా చదవండి:ఏపీకి ప్యాకేజీ ... భగ్గుమన్న సోషల్ మీడియా

English summary

Power Star Pawan Kalyan was recently conducted a meeting in Tirupati and he announced that he was going to conduct meetings all over the districts of Andhra Pradesh and his first meeting was going to be conduct tomorrow at Kakinada and all were waiting eagerly to know what will Pawan Kalyan Speak About this in Meeting.