దానాలు.. వాటి వల్ల కలిగే లాభాలు

What will you get if you donate some items

10:44 AM ON 11th May, 2016 By Mirchi Vilas

What will you get if you donate some items

ఈ మధ్య కాలంలో ఏవరైనా ఏదైనా చెబితే 'మన పెద్దవాళ్లు దీంట్లో ఏదో ఒక సైంటీఫిక్‌ రీజన్‌ పెట్టే ఉంటారు' అని చెబుతుండడం తెల్సిందే. పెద్దవారు మనకి పెట్టిన ఆచారాలు-సాంప్రదాయాలు. కాని కొన్ని ఆచారాలు ఏంటో వాటి వెనుకున్న ఆంతర్యమేంటో ఓ పట్టానా అర్థం కావు. అయితే మన పెద్ద వారు ఏ దానం చేస్తే ఏ లాభం వస్తుందో బానే వివరించారు. అయితే దాని లాజిక్కుని ఫన్నీగా ఊహించుకుంటే, భలే కిక్కు ఇస్తుంది.  దానాలు వాటి వెనుకున్న లాజిక్కులు. ఏందిరా నాయనా ఇది అని తలలు పట్టుకోకండి. ఏదో సరదాకి, మరి అంత సీరియస్‌ అవకండి. ఇది సరదాకి తప్ప ఎవరిని భాద పెట్టడానికి కాదని గ్రహించండి.

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు…

1/12 Pages

10. బంగారంని దానం చేస్తే... దోషాలు తొలగుతాయి:


మన పెద్ద వాళ్ళు బంగారాన్ని దానం చేస్తే ఉన్న దోషాలు పోతాయని చెప్పారు. ఇక్కడ దోషం అంటే చెడు లేదా తప్పు అని మనం అనుకోవచ్చు. బంగారం ఎక్కువ ఉంటే డబ్బు ఎక్కువ ఉన్నట్లు కదా. డబ్బు ఎక్కువయితే కన్ను మిన్ను కనబడకుండా ధనవంతుడిని అనే పొగరుతో తప్పులు చేసే అవకాశం పెరుగుతుందని, అదే దాన్ని దానం చేస్తే బాలెన్స్‌డ్ గా ఉండి తప్పులు చేయరు అని ఇలా చెప్పి ఉంటారు. కావాలంటే మీరే చూడండి డబ్బున్న వాళ్ల పిల్లలు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అని, రేసింగ్‌లని ఎన్ని తప్పులు చేస్తుంటారో.

English summary

What will you get if you donate some items. What profits and benefits will we get if we donate food items and gold, silver.